అసలు రాణి సక్సేనా నేను కాదు..!
సౌత్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యి బాలీవుడ్ కి వెళ్లిన తాప్సి అక్కడ పలు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే
By: Tupaki Desk | 8 Aug 2024 7:30 PM GMTసౌత్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యి బాలీవుడ్ కి వెళ్లిన తాప్సి అక్కడ పలు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. 2021లో తాప్సి నటించిన 'హసీనా దిల్‌రుబా' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సమయంలో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా డైరెక్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ ఏడాదిలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో చోటు సంపాదించింది. ఆ సినిమాలో తాప్సి నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కడం తో పాటు కథ కు మంచి మార్కులు పడ్డాయి.
అప్పటి నుంచే హసీనా దిల్‌రుబా సినిమా సీక్వెల్ గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఫిర్ ఆయీ హసీనా దిల్‌రుబా అనే టైటిల్ తో సీక్వెల్ రూపొందింది. ఈ సినిమాలో రాణి సక్సేనా పాత్రలో తాప్సీ కనిపించబోతోంది. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ మరియు టీజర్ లు మరోసారి తాప్సీ రాణి సక్సేనా గా హిట్ కొట్టడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో తాప్సీ నటిస్తున్న ఇలాంటి సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న కారణంగా ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.
నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కు తాప్సీ న్యాయం చేసింది. రాణి సక్సేనా పాత్ర తాప్సీ కోసమే పుట్టింది అన్నట్లుగా నటించి మెప్పించింది. అయితే మొదట ఈ పాత్ర ను మరో నటితో చేయించాలని భావించారట. షూటింగ్ కూడా ప్రారంభం అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడం, ఆ స్థానంలోకి తాను రావడం జరిగిందని తాప్సీ చెప్పుకొచ్చింది. కొన్నిసార్లు అదృష్టం అనేది తలుపు తట్టి మరీ వస్తుంది అంటారు. అది తాప్సీ విషయంలో ఈ సినిమా ద్వారా నిరూపితం అయ్యిందని మరోసారి వెల్లడి అయింది.
ఫిర్ ఆయీ హసీనా దిల్‌రుబా ఈనెల 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో తాప్సీ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఒక ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ... కనికా ధిల్లాన్ ఒకానొక సందర్భంలో కలిసినప్పుడు నేను ఒక విభిన్నమైన కథను రాసుకున్నాను అని నాతో చెప్పారు. ఆ కథ వినాలని అనుకున్నాను, కానీ అప్పుడు నేను ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఆ సమయంలో కథ వినలేక పోయాను.
కొన్ని రోజుల తర్వాత అదే కథతో మరో హీరోయిన్ తో సినిమాను చేస్తున్నట్లు నాకు తెలిసింది. కనికా ధిల్లాన్ ను ఆ విషయమై నేను సంప్రదించలేదు. షూటింగ్ కూడా ప్రారంభం అయ్యిందని విన్నాను. అంతలో ఏం అయ్యిందో కానీ నాకు ఒక రోజు కనికా ధిల్లాన్ ఫోన్ చేసి ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా నా వద్ద ఉన్న ఆ కథను వినేందుకు ఆఫీస్ కు రావాల్సిందిగా పిలిచింది. వెంటనే వెళ్లి ఆ కథను విన్నాను. ఈ కథ నాకోసం రాసినట్లు ఉందని అప్పుడే అన్నాను. అన్నట్లుగానే ఆ పాత్ర నాకు బాగా సెట్ అయ్యిందని చాలా మంది అన్నారు అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. మరోసారి రాణి సక్సేనా గా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తాను అనే నమ్మకం ను తాప్సి వ్యక్తం చేసింది.