Begin typing your search above and press return to search.

తాప్సీ పెళ్లి ని అంత లైట్ తీసుకుంటుందా?

పుట్టిన తేదీలైనా మ‌ర్చిపోతు న్నారేమోగానీ..వివాహ తేదీలు మాత్రం ఈ జ‌న‌రేష‌న్ లో ఎవ‌రూ మ‌ర్చిపోవ‌డం లేదు.

By:  Tupaki Desk   |   26 July 2024 1:30 PM GMT
తాప్సీ పెళ్లి ని అంత లైట్ తీసుకుంటుందా?
X

ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో వివాహానిక ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ప్రతీ మ‌గాడు, మ‌హిళ జీవితంలో అది సెకెండ్ ఇన్సింగ్స్ . అప్ప‌టి వ‌ర‌కూ లైఫ్ ఒక‌లా సాగితే అప్ప‌టి నుంచి మ‌రోలా ముందుకెళ్తుంది.అందుకే వివాహ తేదీని ఏ ఒక్క‌రూ మ‌ర్చిపోరు. జ‌న్మంతా గుర్తిండిపోయే తేదీ. పుట్టిన తేదీలైనా మ‌ర్చిపోతు న్నారేమోగానీ..వివాహ తేదీలు మాత్రం ఈ జ‌న‌రేష‌న్ లో ఎవ‌రూ మ‌ర్చిపోవ‌డం లేదు.

అంతే కాదు మ్యారేజ్ డేని అంతే గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సెల‌బ్రిటీల విష‌యానికి వ‌స్తే విదేశాల‌కు చెక్కేసి మ‌రీ ఇలాంటి డేట్లు సెల‌బ్రేట్ చేసుకుంటారు. ఇలాంటి వాటికి వ‌య‌సుతో సంబంధం ఉండ‌దు కాబ‌ట్టి! లైఫ్ ని ఆ ఒక్క రోజులో మ‌రింత‌ సంతోషంగా ఉండేలా చూసుకుంటారు. అంత ప్రాధాన్యత పెళ్లితేదికి ఉంది. అయితే అలాంటి పెళ్లి తేదీనే మ‌ర్చిపోయింది తాప్సీ.

అవును ఈ విష‌యం స్వ‌యంగా ఆమె వెల్ల‌డించింది. వివ‌రాల్లోకి వెళ్తే `ఖేల్ ఖేల్ మే` ప్ర‌చారం ముగించుకుని తిరిగొస్తున్న స‌మ‌యంలో ఓ ఫోటో గ్రాఫర్ స‌డెన్ గా ఆమెకి శుభాకాంక్ష‌లు చెప్పాడు. దీంతో తాప్సీ ఆశ్చ‌ర్య‌పోయింది. అదేంటి మూవీ రిలీజ్ కాక ముందే హిట్ అయిందా? అందుకే విషెస్ చెబుతున్నావా? అంది. దానికి అత‌డు అంతుకు కాదు మ్యాడం. మీకు పెళ్లి శుభాకాంక్ష‌లు చెబుతున్నా? అన్నాడు.

అది విన్న తాప్సీ ఓ హ్ పెళ్లి గురించి చెబుతున్నావా? నాకు పెళ్లి అయిందన్న విష‌యాన్ని నేనే మ‌ర్చిపోయాను` అంది. దీంతో ఆ ఫోటో గ్రాఫ‌ర్ షాక్ అయ్యాడు. పెళ్లి తేదీ మ‌ర్చిపోయావా? అన్న‌ట్లు ఓ ర‌క‌మైన ఎక్స్ ప్రెష‌న్ తో ఆమె వెంట ప‌డి ఫోటోలు తీయ‌డం కూడా వృధ్దా అనుకున్నాడో ఏమో అక్క‌డ నుంచి వెళ్లిపోయాడు. దీంతో నెట్టింట నెటి జ‌నులు `చూసారా తాప్సీ పెళ్లి తేదీ కూడా మ‌ర్చిపోయింది. ఈవిడ దృష్టిలో పెళ్లికి అంత విలువ ఉంది? అంటూ కామెంట్లు పెడుతున్నారు. డెన్మార్క్ కి చెందిన బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ మ‌థియ‌స్ బెని మార్చిలో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.