Begin typing your search above and press return to search.

నో అంటే నో.. నేను పబ్లిక్ ప్రాపర్టీ కాదు.. తాప్సి వైరల్ స్టేట్మెంట్..

తెలుగులో గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లో మాత్రం ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది.

By:  Tupaki Desk   |   25 Aug 2024 8:43 AM GMT
నో అంటే నో.. నేను పబ్లిక్ ప్రాపర్టీ కాదు.. తాప్సి వైరల్ స్టేట్మెంట్..
X

టాలీవుడ్ నుంచి ఎందరో హీరోయిన్లు బాలీవుడ్‌కి వెళ్లి బాగా పేరు తెచ్చుకున్నారు. అలా తెలుగులో పెద్ద సక్సెస్ఫుల్ కాకపోయినా హిందీకి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకొని బాగా సెటిల్ అయిన హీరోయిన్ తాప్సి. తెలుగులో గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లో మాత్రం ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మందినాదం మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.

అలాగే తమిళ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కానీ ఇక్కడ సక్సెస్ ఊహించిన రేంజ్‌లో రాకపోవడంతో మెల్లిగా బాలీవుడ్‌కి వెళ్లి సెటిల్ అయిపోయింది. 2013లో ఛ‌ష్మే బ‌ద్దూర్‌ మూవీతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 2014లో విడుదలైన పింక్ చిత్రంతో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత ది ఘాజీ అటాక్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్,డంకీ లాంటి పలు చిత్రాలలో నటించి మెప్పించింది.

హిందీలో హీరోయిన్ సెంట్రిక్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా తాప్సీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి ముఖ్యంగా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన శభాష్ మిథు మూవీలో మిథాలీ రాజ్ పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకుంది.. తన మనసులోని మాటను నిక్కచ్చిగా మాట్లాడడానికి తాప్సి అస్సలు వెనకాడదు అన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా సందర్భాల్లో ఆమె మాట్లాడిన మాటలు పలు రకాల వివాదాలకు కూడా దారి తీసాయి.ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘నేను కేవలం ఒక నటిని మాత్రమే.. పబ్లిక్ ప్రాపర్టీ ని కాదు’అని తాపసీ చేసిన బోల్డ్ స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. తాప్సి ఈ మాటలని

‘పాపరాజీ’ ను ఉద్దేశించి మాట్లాడింది. అంతేకాదు ఎవరైనా నో చెబితే అది ఖచ్చితంగా నో అన్న విషయం అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలని.. నటి అవ్వడానికి అంటే ముందుగా తాను ఒక అమ్మాయిని.. నటన తనకు నచ్చిన వృత్తి కాబట్టి చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

సాధారణంగా సెలబ్రిటీలను చూసినప్పుడు వారి ఫోటోలు, వీడియోలు తీయడం కోసం పాపరాజీలు హడావిడి పడుతూ ఉంటారు. అయితే దీన్ని అందరూ సెలబ్రిటీలు ఒకే విధంగా తీసుకోరు. కొందరు సహకరిస్తే.. మరి కొందరు గమ్ముగా అక్కడ నుంచి వెళ్ళిపోతారు.. కానీ కొందరు మాత్రం అలా చేయడం తప్పు అని గట్టిగా ఖండిస్తారు. ఇప్పుడు తాప్సీ చేసింది కూడా అదే.’కెమెరాలతో నా పైకి దూసుకు రావడం.. ఫిజికల్‌గా హ్యాండిల్ చేయడం చాలా తప్పు.. ఎవరైనా నో అని చెబితే వారి అభిప్రాయానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి.. నేను ఒక నటిని ..కానీ పబ్లిక్ ప్రాపర్టీని కాదు..’అంటూ తాప్సీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.