Begin typing your search above and press return to search.

గ్లామ‌ర్ హ‌ద్దులు చెరిపేసిన తాప్సీ

త‌న‌లోని స‌హజసిద్ధమైన అందం రూప‌లావ‌ణ్యం యువ‌త‌రాన్ని ఎంతో ఆక‌ర్షిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   10 Jan 2024 3:38 AM GMT
గ్లామ‌ర్ హ‌ద్దులు చెరిపేసిన తాప్సీ
X

బాలీవుడ్ లో వ‌రుసగా ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టించిన తాప్సీ ప‌న్ను `డంకీ`లో షారూఖ్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. హిందీలో చాలా కాలానికి అగ్ర హీరో స‌ర‌స‌న అవ‌కాశం ద‌క్కించుకున్న సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి న‌టిగాను మెప్పించింది. డంకీలో తాప్సీ న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. తాప్సీ లేటెస్ట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో హీట్ పుట్టిస్తోంది. థై స్లిట్ స్కర్ట్ గిర‌జాల జుత్తుతో తాప్సీ గుండెల్లో గుబులు పుట్టించింది. క్రీమ్ కలర్ బ్రాలెట్ లో తాప్సీ వేడిని పెంచుతోంది. త‌న‌లోని స‌హజసిద్ధమైన అందం రూప‌లావ‌ణ్యం యువ‌త‌రాన్ని ఎంతో ఆక‌ర్షిస్తున్నాయి.


ఇటీవ‌ల విడుద‌లైన `డంకీ` చిత్రం విమర్శకులు ప్రేక్షకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ కూడా ప్రధాన పాత్రలో నటించాడు. తాప్సీ క‌థానాయిక‌గా న‌టించింది. తాజా ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్‌తో కలిసి డంకీలో పని చేయడం గురించి తాప్సీ కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసింది. SRKతో పనిచేసిన అనుభవం గురించి అడిగినప్పుడు, ``మీరు అత‌డికి బానిస అయిపోతారు` అని సంకోచించకుండా సమాధానమిచ్చింది. డంకీలో ఖాన్‌తో తాప్సీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. డంకీ తన జీవితంలో కొత్త మైలురాయి అని కూడా త‌ప్సీ ఆనందం వ్య‌క్తం చేసింది.

ఇంతకుముందు తాప్సీ పన్ను దర్శకుడు నీరజ్ పాండేతో కలిసి పనిచేయాల‌నుంద‌ని ఆస‌క్తిని వ్య‌క్త‌ప‌రిచారు. ఆయ‌న‌ను చాలాసార్లు అభ్యర్థించినట్లు పేర్కొంది. గ‌తంలో నీరజ్‌తో కలిసి బేబీ-నామ్ షబానా వంటి సినిమాల్లో పనిచేసింది. నీర‌జ్ తో మ‌రో కొత్త సినిమా చేస్తాన‌ని ఆశాభావం వ్య‌క్తం చేసింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. తాప్సీ నటించిన `ఫిర్ ఆయీ హస్సీన్ దిల్రూబా` బాలీవుడ్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఇది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒక‌టి. ఈ చిత్రం 2021లో విడుదలైన `హసీన్ దిల్రూబా`కి సీక్వెల్. ఇది 2024లో విడుద‌ల‌వుతుందని తెలిపింది.