Begin typing your search above and press return to search.

ఆద‌మ‌రిచి కెమెరా ముందు ఉత్తమ న‌టి

తాజాగా ఈ సీనియ‌ర్ న‌టి ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. అయితే కెమెరా ముందు మైమ‌రిచి రెచ్చిపోయింది.

By:  Tupaki Desk   |   21 Dec 2024 3:50 AM GMT
ఆద‌మ‌రిచి కెమెరా ముందు ఉత్తమ న‌టి
X

జాతీయ ఉత్తమ న‌టిగా ఆమె సుప్ర‌సిద్ధురాలు. కెరీర్‌లో ఎన్నో ఫైనెస్ట్ పెర్ఫామెన్సెస్‌తో ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచారు. 53 వ‌య‌సులోను బిజీ న‌టి. ఏజ్‌లెస్ బ్యూటీగా నేటిత‌రంతో పోటీప‌డుతూ దూసుకెళుతోంది. సోష‌ల్ మీడియాల్లోను ఫోటోషూట్ల‌తో ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఈ సీనియ‌ర్ న‌టి ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. అయితే కెమెరా ముందు మైమ‌రిచి రెచ్చిపోయింది. చెప్పులు గిరాటేసి.. సోఫాలో ఆద‌మ‌రిచి కెమెరాకు ఫోజులిచ్చింది. బ్లాక్ ఫ్రాక్ ధ‌రించి కెమెరా ముందు రెచ్చిపోయిన‌ ఈ బ్యూటీ ఎవ‌రో ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. న‌టి ట‌బు ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌తో ఫోజులివ్వ‌గా, కెమెరా ఫ్లాష్‌లు మెరిసాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది.

53ఏళ్ల వెట‌ర‌న్ న‌టి ట‌బు తన కెరీర్ ఆద్యంతం ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు. ఇటీవ‌ల `క్రూ` చిత్రంలో ఎయిర్ హోస్టెస్ గా గ్లామ‌ర‌స్ పాత్ర‌లో ఆక‌ట్టుకున్న ట‌బు, ఆంగ్ల వెబ్ సిరీస్ `డూన్: ప్రొఫెసీ`లో అద్భుత న‌ట‌న‌తో అల‌రించార‌ని ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. న‌టిగా సుదీర్ఘ‌మైన అనుభ‌వాన్ని ఉప‌యోగించి `డూన్` చిత్రంలో న‌న్ పాత్ర‌లో న‌టించింద‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. పరిపూర్ణమైన న‌ట‌ప్రతిభతో టబు తన పేరును ప్రపంచ పటంలో చిర‌స్థాయిగా నిలుపుకుందని అమెరికా ప్ర‌జ‌లు, ఎన్నారైలు ప్ర‌శంసిస్తున్నారు.

డూన్‌లో కీల‌క పాత్ర‌ధారి ఎమిలీ వాట్స‌న్ ట‌బును ప్ర‌శంసిస్తూ.. `నిజమైన నిధి` అని వ్యాఖ్యానించారు. ``టబుతో కలిసి పనిచేయడం చాలా అందమైన అనుభవం. ఆమె నిజమైన నిధి.. చాలా అందమైన ఉదారమైన వ్యక్తి.. అద్భుతమైన నటి.. మేం కలిసి కొంత నాణ్య‌మైన‌ సమయాన్ని గడిపాము`` అని ఎమిలీ హిందూస్తాన్ టైమ్స్‌తో అన్నారు. తాము క‌లిసి విందు వినోదాల్లో మునిగి తేలామ‌ని కూడా తెలిపారు.