Begin typing your search above and press return to search.

ట‌బు గౌన్ త‌యారీకి నెల రోజులు?

ప్పుడు న్యూయార్క్‌లో HBO డూన్: ప్రొఫెసీ వరల్డ్ ప్రీమియర్‌కు ట‌బు హాజరయ్యారు.

By:  Tupaki Desk   |   31 Oct 2024 11:30 PM GMT
ట‌బు గౌన్ త‌యారీకి నెల రోజులు?
X

హాలీవుడ్ వ‌ర‌ల్డ్‌లో సీనియ‌ర్ న‌టి టబు పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆంగ్ లీ తెర‌కెక్కించిన ఆస్కార్ విన్నింగ్ మూవీ `లైఫ్ ఆఫ్ పై` స‌హా ప‌లు హాలీవుడ్ చిత్రాల్లో ట‌బు న‌టించారు. ఇప్పుడు అమెరిక‌న్ టీవీ సిరీస్ - డూన్ ప్రోఫెస్సీలోను ట‌బు న‌టించింది. ఇంత‌కుముందు విడుద‌లైన ట్రైల‌ర్ లో ట‌బు మెరుపులా క‌నిపించి ఆక‌ట్టుకుంది.

ఇప్పుడు న్యూయార్క్‌లో HBO డూన్: ప్రొఫెసీ వరల్డ్ ప్రీమియర్‌కు ట‌బు హాజరయ్యారు. భారతీయ డిజైనర్లు అబూ జానీ సందీప్ ఖోస్లా కస్టమ్-మేడ్ చేసిన బ్లాక్ కోచర్ గౌనులో ట‌బు షో స్టాప‌ర్ గా నిలిచారు. ఫ్యాషన్ డిజైన‌ర్స్ కి చెందిన ఇన్‌స్టాగ్రామ్ పేజీ డైట్ సబ్య ప్రపంచ ప్రీమియర్ నుండి టబు వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోకి `రెవరెండ్ మదర్ టబు` అని వ్యాఖ్య‌ను జోడించింది. ఈ కస్టమ్ మేడ్ గౌను త‌యారు చేయ‌డానికి ఒక నెల పట్టిందని ట‌బు వెల్ల‌డించారు. అబు జానీ, సందీప్ ఖోస్లాను `భారతదేశంలో అత్యంత పాపుల‌ర్ డిజైనర్లు` అని అభివ‌ర్ణించారు. నేను వారిని ప్రేమిస్తున్నాను అని టబు అన్నారు.

డూన్: ప్రోఫెసీ ప్రీమియర్ థీమ్ కి త‌గ్గ డిజైన‌ర్ గౌన్ ఇది. ప్రొఫెసీ లుక్‌ని డీకోడింగ్ చేస్తూ డిజైన‌ర్లు రూపొందించారు.

అబు జానీ సందీప్ ఖోస్లా కస్టమ్ బ్లాక్ గౌను ప్ర‌త్యేక‌త ఏమిటీ అంటే.. ఒక క్లాసిక్ అంగ్రాఖాను తిరిగి రూపొందించే ఒక రకమైన కోచర్ పీస్. డైట్ సబ్య ప్రకారం.. ఇది స్వచ్ఛమైన ఖాదీ సిల్క్‌తో తయారు చేసిన‌ది. 38 సంవత్సరాల క్రితం కనుగొన్న‌ ఒక రహస్య ఆర్టిసానల్ సిగ్నేచర్ టెక్నిక్ ద్వారా సృష్టించిన ఆకృతి గ‌ల గౌను. ఆఫ్-షోల్డర్ ప్లంగింగ్ నెక్‌లైన్, ఫుల్-లెంగ్త్ స్లీవ్‌లు, బస్ట్ కింద సిన్చ్డ్ సిల్హౌట్.. ఫ్లోర్ స్కర్ట్‌తో పాటు ఫ్లోర్-లాంగ్ డిజైన్...

`డూన్: ప్రొఫెసీ` టీవీ సిరీస్ నవంబర్ 18 నుండి `జియో సినిమా`లో ప్రసారం కానుంది. ఈ సిరీస్‌లో సిస్టర్ ఫ్రాన్సిస్కా పాత్రలో టబు కనిపించనుంది. ఇది తిమోతీ చలమెట్ `డూన్: పార్ట్ వన్`కు ప్రీక్వెల్.