పెళ్లి వద్దు.. మంచంపై మగాడు కావాలి.. ఖండించిన టబు
''పెళ్లి వద్దు.. మంచంపై మగాడు కావాలి..''.. కొద్ది రోజులుగా జాతీయ ఉత్తమ నటి టబు ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 21 Jan 2025 4:42 AM GMT''పెళ్లి వద్దు.. మంచంపై మగాడు కావాలి..''.. కొద్ది రోజులుగా జాతీయ ఉత్తమ నటి టబు ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియా పోస్ట్‌లు ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా టబు బృందం ఈ అవమానకరమైన వాదనలను ఖండిస్తూ బలమైన ప్రకటన విడుదల చేసింది. ఇవన్నీ అసత్య ప్రచారాలు.. తప్పుగా ఆపాదిస్తున్నారని, ఉన్నవి లేనివీ ప్రచారం చేస్తున్నారని టబు టీమ్ ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేయడం ఆపాలని ఒక అధికారిక ప్రకటనలో హెచ్చరించింది.
ఇప్పటికే టబు గురించి చాలా వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియాలు ఇలాంటి ప్రచారంలో తలమునకలుగా ఉన్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించే నీచమైన నైతిక ఉల్లంఘన ఇది అని టబు బృందం సీరియస్ అయింది. మీడియా జవాబుదారీగా ఉండాలని కూడా వారు కోరారు. వెబ్‌సైట్‌లు కల్పిత కోట్‌లను వెంటనే తొలగించి, చేసిన తప్పిదానికి అధికారిక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని కూడా ప్రకటనలో పేర్కొన్నారు. ఒక నటిని ఇలా తప్పుగా చూడటం దైవదూషణతో సమానమని, టబు తన బాలీవుడ్ ప్రయాణంలో నిజాయితీగా ఉన్నారని కూడా ప్రకటనలో పేర్కొన్నారు.
'చాందిని బార్' చిత్రంతో టబు జాతీయ ఉత్తమనటిగా పురస్కారం అందుకున్నారు. కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన టబు ఇటీవలే `క్రూ` లాంటి కమర్షియల్ చిత్రంలో గ్లామరస్ క్వీన్ గా కనిపించి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న `భూత్ బంగ్లా` చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ తదితరులు నటించారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత అక్షయ్ - టబు తిరిగి జంటగా నటిస్తున్నారు. హేరా ఫేరి తర్వాత ఇంతకాలానికి ఈ జోడీ తిరిగి రిపీటవుతోంది.