Begin typing your search above and press return to search.

ఆలోచించకుండా ఒప్పేసుకున్నా : టబు

ఒక నటిగా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించాలని కోరుకుంటాం.

By:  Tupaki Desk   |   14 Aug 2024 1:30 PM GMT
ఆలోచించకుండా ఒప్పేసుకున్నా : టబు
X

సీనియర్‌ హీరోయిన్‌ టబు ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా బిజీ బిజీగా సినిమాలు, సిరీస్ లు చేస్తూనే ఉంది. తెలుగు లో హీరోయిన్ గా చేసింది మొదలుకుని బాలీవుడ్‌ లో అడుగు పెట్టి అక్కడ స్టార్‌ హీరోలకు ఒకానొక సమయంలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా నిలిచిన టబు ఇప్పుడు అంతే బిజీగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో నటిస్తోంది. అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరిస్తోంది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్ లో ఈమెకు నటించే అవకాశం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మక సిరీస్ లో నటించే అవకాశం రావడంతో టబు చాలా సంతోషం వ్యక్తం చేసింది.

హాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డ్యూన్ : ప్రాఫెసీ లో సిస్టెర్ ఫ్రాన్సెస్కా పాత్ర లో టబు నటించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో టబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దర్శక నిర్మాతలు డ్యూన్‌ సిరీస్‌ ఫ్రాన్సెస్కా పాత్ర కోసం సంప్రదించిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పాను. ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత మరియు సిరీస్ లో ఆ పాత్ర చుట్టు కథ తిరిగే విధానం నాకు బాగా నచ్చింది. అందుకే వెంటనే ఆ పాత్రకు ఓకే చెప్పాను అంటూ టబు చెప్పుకొచ్చింది.

ఒక నటిగా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించాలని కోరుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా కోరుకున్న మంచి పాత్రలు మరియు మంచి సినిమాలు రావడం కష్టం. కానీ నేను కోరుకున్న ఒక మంచి పాత్రకు నాకు ఈ సిరీస్ రూపంలో వచ్చిందని టబు సంతోషం వ్యక్తం చేసింది. సిరీస్ ప్రారంభం అయిన వెంటనే నేను పోషించిన పాత్ర కనిపిస్తుంది. దాంతోనే సిరీస్ కు పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు అంటూ టబు చెప్పుకొచ్చింది. జియో సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ సిరీస్‌ ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లుగా టబు తెలియజేసింది.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ వెబ్‌ సిరీస్‌ ను నవంబర్ లో స్ట్రీమింగ్‌ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ప్రమోషన్స్‌ మొదలు పెట్టిన తర్వాత డబుల్‌ అవ్వడం ఖాయం అని, టబు వల్ల ఇండియాలో ఈ వెబ్‌ సిరీస్ ను అత్యధికులు చూడటం ఖాయంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్‌ సినిమాల్లో మరియు సిరీస్ ల్లో ఈమధ్య కాలంలో మన ఇండియన్‌ స్టార్స్ ఎక్కువగా నటించడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు టబు కూడా హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ లో భాగస్వామ్యం అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.