హాలీవుడ్ లో సీనియర్ హాట్ సెరైన్!
సీనియర్ నటి టబు సెకెండ్ ఇన్నింగ్స్ ని సైతం జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 May 2024 6:55 AMసీనియర్ నటి టబు సెకెండ్ ఇన్నింగ్స్ ని సైతం జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తోన్న సంగతి తెలిసిందే. `అలవైకుం ఠపురము`తో టాలీవుడ్ లో కంబ్యాక్ అయిన తర్వాత బాలీవుడ్ కెరీర్ మరింత దేదీప్యమానంగా సాగిపోతుంది. తెలుగులో కంటున్యూ కాలేదు గానీ బాలీవుడ్ లో మాత్రం మోతెక్కిస్తుంది. వరుస గా హిందీ సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఇటీవలే `ది క్రూ` తో మరో భారీ విజయం అందుకుంది. ఆ సినిమా 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో లేటు వయసులోనూ ఘాటు వసూళ్లు అనే కితాబు సొంతం చేసుకుంది.
ప్రస్తుతం హిందీ లో మరికొన్నిప్రాజెక్ట్ లకు కమిట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా అమ్మడు ఏకంగా హాలీవుడ్ కే ప్రమోట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అశేష ఫాలోయింగ్ ఉన్న డ్యూన్ సిరీస్ లో అవకాశం అందుకుంది. త్వరలో అదే టైటిల్ కి ప్రోఫెసిని జోడించి భారీ బడ్జెట్ తో ఈ ప్రీక్వెల్ తెరకెక్కించనున్నారు. ఇందులో టబు సిస్టర్ ఫ్రాన్సెస్ గా ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీంతో ఇండియా వైడ్ టబు పేరు మరోసారి మోతెక్కడం మొదలైంది.
ఈసిరీస్ ఛాన్స్ అంటే అంత ఈజీ కాదు. అలాంటి లక్కీ ఛాన్స్ అందుకోవడం టబు అదృష్టమంటూ విషెస్ తెలియజేస్తున్నారు. `డ్యూన్` మొదటి భాగానికి 10 వేల సంవత్సరాల క్రితం ఏం జరిగిందనే పాయింట్ తో ఈ కథను రాసుకున్నారు. స్కైఫై జానర్ లో తెరకెక్కుతున్న ఈ డ్యూన్ ప్రోఫెసికి భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. మొదటి భాగం కంటే అయిదింతలు ఎక్కువగా పెడుతున్నారుట. ఆ రేంజ్ ఖర్చు ఉందంటే? షూట్ పూర్తి చేసి రిలీజ్ చేయడానికి చాలా సమయం కూడా పడుతుంది. హాలీవుడ్ వాళ్లు అంటేనే ప్రతీ ప్రేమ్ ని ఎంతో అద్భుతంగా చెక్కుతారు.
కాబట్టి రిలీజ్ మూడేళ్లు అయినా పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటులు చాలా మంది హాలీవుడ్లో పనిచేసారు. అమ్రిష్ పూరి, ఇర్ఫాన్ ఖాన్, అనీల్ కపూర్, ఓంపూరి ప్రత్యేక పాత్రల్లో మెరిసారు. ఆ తర్వాత తరంలో మరికొంత మంది పనిచేసారు. ఐశ్వర్యారాయ్...దీపికా పదుకోణే కూడా హాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించు కున్నారు. అటుపై ప్రియాంక చోప్రా మాత్రం హాలీవుడ్ లో పీక్స్ కి చేరింది. మరి టబు హాలీవుడ్ జర్నీ ఎలా సాగుతుందన్నది చూడాలి.