Begin typing your search above and press return to search.

సీనియర్ భామ ఆ స్టేట్మెంట్ ఇస్తే మనోళ్లు ఊరుకుంటారా..?

వెండితెర మీద ఎంతమంది కొత్త భామలు వస్తున్నా ఒకప్పటి సినీ తారల ముందు వీళ్లు ఎంతా అన్న భావన ఉంటుంది

By:  Tupaki Desk   |   19 Jun 2024 8:30 AM GMT
సీనియర్ భామ ఆ స్టేట్మెంట్ ఇస్తే మనోళ్లు ఊరుకుంటారా..?
X

వెండితెర మీద ఎంతమంది కొత్త భామలు వస్తున్నా ఒకప్పటి సినీ తారల ముందు వీళ్లు ఎంతా అన్న భావన ఉంటుంది. ముఖ్యంగా ఒకప్పుడు గ్లామర్ షోతో హా**ట్ ఇమేజ్ తెచ్చుకున్న భామలు ఇప్పటికీ వారి క్రేజ్ ను కొనసాగిస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అలాంటి భామల్లో ప్రత్యేకంగా చెప్పుకుంటే టబు కచ్చితంగా ఉంటుంది. నిన్నటితరం స్టార్ హీరోయిన్ అయిన టబు కెరీర్ మొదట్లో తెలుగు సినిమాలు చేసి బాలీవుడ్ వెళ్లి అక్కడ సెటిల్ అయ్యింది.

సిల్వర్ స్క్రీన్ మీద ఇటు అందంతో అటు అభినయంతో టబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తెర మీద గ్లామర్ గా కనిపించడానికి ఏమాత్రం మొహమాట పడని టబు ఆ గ్లామర్ షోతోనే సూపర్ స్టార్ డం తెచ్చుకుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఇక్కడ కూడా టబు అంటే ఇష్టపడే ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నారు. ముఖ్యంగా నాగార్జునతో టబు జోడీ అక్కినేని ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుంది. ఐతే ఏజ్ బార్ అవుతున్నా ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తుంది టబు.

నిన్న మొన్నటిదాకా ఫిమేల్ లీడ్ రోల్స్ చేసిన టబు ఇప్పుడు వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టట్లేదు. చివరగా తెలుగులో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో కనిపించిన టబు హిందీలో రీసెంట్ గా క్రూ సినిమాతో మెప్పించింది. టబు సినిమాలో ఉంది అంటే స్కిన్ షో ఉన్నట్టే లెక్క. 50 ప్లస్ ఏజ్ లో కూడా ఆ విషయంలో నో కాంప్రమైజ్ అనేస్తుంది అమ్మడు.

ఐతే రీసెంట్ ఇంటర్వ్యూలో తనకు ఇంకా రొమాంటిక్ సినిమాలు చేయాలని ఉందని వెల్లడించింది టబు. ఆ స్టేట్ మెంట్ ని బాలీవుడ్ మేకర్స్ ఎలా తీసుకున్నారో కానీ మన దర్శక నిర్మాతలు మాత్రం టబు చేస్తానంటే ఆమెను పెట్టి మంచి రొమాంటిక్ సినిమాలు చేసేందుకు సిద్ధం అంటున్నారు. టబు నిజంగానే చేయాలనే ఉద్దేశంతో అన్నదో లేదో కానీ ఆమె స్టేట్ మెంట్ ని చూసి టబు కోసం బోల్డ్ కథలు రాసేందుకు రెడీ అంటున్నారు. అయితే టబు ని మెప్పించే కథ రాస్తే మాత్రం ఆమె నటించడానికి నో చెప్పే అవకాశం లేదని చెప్పొచ్చు. టబు తెలుగులో సినిమా చేస్తానంటే చాలు కానీ ఎంతోమంది దర్శకులు ఆమెతో సినిమా చేసేందుకు సిద్ధం అంటారు. మరి టబు ని కన్విన్స్ చేసే కథ దొరుకుతుందేమో చూడాలి.