ఫోటో స్టోరి: ఇంకా వేడి తగ్గలేదు మ్యాడమ్
పాత్రని బట్టి టబు తనని తాను మౌల్డ్ చేసుకుంటూ నవతరం భామలకు ధీటుగా అవకాశాలు అందుకుంటుంది.
By: Tupaki Desk | 25 March 2024 3:36 PM GMTరెండేళ్లగా సీనియర్ బ్యూటీ టబు కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. 50 ఏళ్ల వయసులోనూ టబు సత్తా చాటుతుంది. స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే హాట్ పాత్రల్లోనూ నటిస్తోంది. 50 ఏళ్ల వయసులోనూ టబు రొమాంటిక్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తుంది. కుర్ర హీరోలతో ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో తనదైన మార్క్ వేస్తోంది. పాత్రని బట్టి టబు తనని తాను మౌల్డ్ చేసుకుంటూ నవతరం భామలకు ధీటుగా అవకాశాలు అందుకుంటుంది.
`ఖూఫియా`..`బోళా` లాంటి చిత్రాల్లో అమ్మడు ఏ రేంజ్ పెర్పార్మెన్స్ చేసిందో తెలిసిందే. ఇక `ది క్రూ`లో అంతకు మించి హాట్ గా అలరించడానికి సిద్దమైంది. ఇప్పటికే క్రూలో టబు ఘాటు ఫోజులు నెట్టింట ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో కనిపిస్తూనే ఉంది. ప్రయాణికుల్ని అందం అనే ఎరతో బురిడి కొట్టించ బోతుంది. పక్కనే కరీనా కపూర్...కృతిసనన్ లాంటి బ్యూటీలు ఉన్నా వాళ్లను మించిన బ్యూటీతో టబు హైలైట్ అవుతుంది.
మరి ఇలా కేవలం ఆన్ ది స్క్రీన్ లోనే? ఆఫ్ ది స్క్రీన్ లో అలాంటి వేడి జాత ఉండదా? అంటే వాళ్లకోసమే ఇలా అంటూ అమ్మడు ఓ ప్రయివేట్ పిక్ తో ఇలా రచ్చకెక్కింది. ఇదిగో ఒక్కడ చిరుత పులి డిజైన్ దుస్తుల్లో సెగలు పుట్టించే భంగిమతో నెట్టింట్లోకి వచ్చేసింది. నవ నాయికల్ని మించి అమ్మడు తనలో వేడితో దాడి చేస్తుంది. సోఫాలో టబు అలా వయ్యారంగా పడుకుని కిల్లర్ లుక్ లో కవ్వించేస్తోన్న వైనానికి ఫిదా కాని దెవరు.
మ్యాడమ్ లో ఆ వేడి ఏమాత్రం తగ్గలేదనడానికి ఇదొక మచ్చు తునక లాంటిందే. ఇదే వేడిలో థై షోకి సైతం తెర తీస్తే! తట్టుకునేదెలా? అనిపించడం ఖాయమే. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. టబు బ్యూటీని ఉద్దేశించి అంతే ఘాటైన కామెంట్లు కనిపిస్తున్నాయి. మండుతోన్న ఎమోజీలను పోస్ట్ చేసి టబుని అంతకు మించి అనేస్తున్నారు.