Begin typing your search above and press return to search.

లేటు వ‌య‌సులో ఘాటు అందం!

రెండేళ్ల‌గా సీనియ‌ర్ బ్యూటీ ట‌బు కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. 50 ఏళ్ల వ‌య‌సులోనూ ట‌బు స‌త్తా చాటుతుంది

By:  Tupaki Desk   |   29 Jun 2024 12:30 AM GMT
లేటు వ‌య‌సులో ఘాటు అందం!
X

రెండేళ్ల‌గా సీనియ‌ర్ బ్యూటీ ట‌బు కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. 50 ఏళ్ల వ‌య‌సులోనూ ట‌బు స‌త్తా చాటుతుంది. స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొన‌సాగుతూనే హాట్ పాత్ర‌ల్లోనూ న‌టిస్తోంది. 50 ఏళ్ల వ‌య‌సులోనూ ట‌బు రొమాంటిక్ ఇమేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తుంది. కుర్ర హీరోల‌తో ఘాటైన రొమాంటిక్ స‌న్నివేశాల్లో త‌న‌దైన మార్క్ వేస్తోంది. పాత్ర‌ని బ‌ట్టి ట‌బు త‌న‌ని తాను మౌల్డ్ చేసుకుంటూ న‌వ‌త‌రం భామ‌ల‌కు ధీటుగా అవ‌కాశాలు అందుకుంటుంది.

'ఖూఫియా'..'బోళా' లాంటి చిత్రాల్లో అమ్మ‌డు ఏ రేంజ్ పెర్పార్మెన్స్ చేసిందో తెలిసిందే. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'ది క్రూ'లో అంత‌కు మించి హాట్ గా వ‌డ్డన చేసింది.మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో సైతం అమ్మ‌డు అంతే వేడిని పంచుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు కాక‌పుట్టించే భంగిమ‌ల‌తో నెట్టింట చ‌ర్చ‌కు తెర తీస్తుంది. తాజాగా అమ్మ‌డు లేటు వ‌య‌సులో ఘాటు అందం గుభాళింపు అంటూ ఇలా మురిపించింది.

అమ్మ‌డు పొడ‌వైన షోల్డర్ లెస్ గౌను ధ‌రించి..ఆపై జాకెట్ ధ‌రించింది. అటుపై కింద కూర్చుని కురులు స‌ర్దుకుంటూ ఫోటోకి ఫోజులిచ్చింది. ట‌బులో ఆబ్యూటీని హైలైట్ చేసిది ఐస్ అన‌డంలో ఎలాంటి సందే హం లేదు. మ‌త్తెన క‌ళ్ల‌తోనే చిత్తు చిత్తు చేసేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోపై అభిమానుల కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం.

'నువ్వు ఏం తింటున్నావ్? మ‌మ్మి అంటూ ఒక‌రు కామెంట్ చేయ‌గా, మరొక‌రు ఈరోజు నీ గురించి ఆలోచించ‌కుండా ఎలా నిద్ర‌పోతాను? అంటూ మ‌రో కామెంట్ చూడొచ్చు. 50 ఏళ్ల వ‌య‌సులోనే ఈ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందంటే? అది ట‌బుకి మాత్ర‌మే సాధ్య‌మైంద‌ని మ‌రోసారి ప్రూవ్ చేసింది. ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లో ఛాన్సులు అందుకుంటుంది.