హాలీవుడ్ సిరీస్ లో టబు ఇంటిమేట్ సీన్లా?
50 ఏళ్ల టబు 30 ఏళ్ల బ్యూటీని తలపిస్తోన్న సంగతి తెలిసిందే. అమ్మడు ఇన్ స్టాలో హాట్ పిక్స్ తో హీటెక్కిస్తోన్న తీరు చూస్తేనే అర్దమవుతుంది.
By: Tupaki Desk | 16 Aug 2024 7:17 AM GMT50 ఏళ్ల టబు 30 ఏళ్ల బ్యూటీని తలపిస్తోన్న సంగతి తెలిసిందే. అమ్మడు ఇన్ స్టాలో హాట్ పిక్స్ తో హీటెక్కిస్తోన్న తీరు చూస్తేనే అర్దమవుతుంది. కుర్రాళ్ల గుండెల్లో రైళ్లుపరిగెట్టిస్తుంది. ఒక్క క్షణం పాటు ఈవిడ టబునా? ఆమె చెల్లినా? అన్నంతగా అమ్మడు రూప లావణ్యంలో మార్పులు తీసుకొచ్చింది.
అజయ్ దేవగణ్ కి జోడీగా `ఔరన్ మే కహాన్ దమ్ తాలో` నటిస్తోంది. సెకెండ్ ఇన్నింగ్స్ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేసిన టబు ఇప్పుడు అజయ్ కి జోడీగా నటించడం అంతే ఆసక్తికరం. నీరజ్ పాండే ఈ చిత్రాన్ని ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మలుస్తున్నాడు. ఇందులో టబు యవ్వనంగా కనిపించే సరికి హీరోతో ఇంటిమేట్ సీన్లు చేస్తోందా? అన్న చర్చ తెరపైకి వస్తోంది. ఇది చిన్నపాటి వివాదానికి సైతం దారి తీసింది.
సినిమాకోసం విఎఫ్ ఎక్స్ ద్వారా యవ్వనంగా కనిపిస్తున్నారా? అని అడిగినందుకు అమ్మడు అంతెత్తున లేచిపడింది.` టీనేజ్ అమ్మాయిలా నటించాలనే ఆశలేదు. నేనిప్పుడు ఎలా ఉన్నానో? సినిమాలో కూడా అలాగే కనిపిస్తాను. నీరజ్ పాండే వయసు తగ్గించే ప్రయత్నాలు చేయలేదని విమర్శకుల నోళ్లకు తాళాలు వేసింది. సరిగ్గా ఇదే వేడిలో అమ్మడు హాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. `డ్యూన్ ప్రాపెసీ` అనే వెబ్ సిరీస్ కి ఎంపికైంది.
ఇందులో అమ్మడు సిస్టర్ ప్రాన్సెస్కా పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే సిరీస్ లో ఛాన్స్ పట్ల సంతోషం వ్యక్తం చేసింది. అయితే అమ్మడు ఇదే సిరీస్ లో హీరోతో ఇంటిమేట్ సన్నివేశాల్లోనూ నటిస్తుందనే ప్రచారం ఊపందుకుంది. టబు యవ్వనంగా మారడం వెనుక అసలు సీక్రెట్ కూడా ఇదే అంటున్నారు. బాలీవుడ్ సినిమా కోసం కాదని...హాలీవుడ్ సిరీస్ కోసమే టబు నవ నాయికని తలపిస్తుందని వినిపిస్తుంది. మరిఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.