Begin typing your search above and press return to search.

ఈమె వయసు నిజంగా 51 అంటే నమ్ముతారా?

తాజాగా టబు తన అందంతో మరోసారి అందరికి షాక్ ఇచ్చింది. పాతికేళ్ల పడుచు అమ్మాయి మాదిరిగా టైట్‌ జీన్స్ ధరించి, సింపుల్‌ టాప్ లో స్కిన్‌ షో చేయకుండానే చూపు తిప్పుకోనివ్వడం లేదు.

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:30 PM GMT
ఈమె వయసు నిజంగా 51 అంటే నమ్ముతారా?
X

సౌత్‌ సినిమాలతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ టబు. సౌత్ నుండి నార్త్‌ కి వెళ్లి అక్కడ దాదాపు అందరు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి అరుదైన రికార్డ్‌ ని సొంతం చేసుకుంది. మూడు దశాబ్దాలుగా టబు సినిమాల్లో సందడి చేస్తూనే ఉంది.


ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు, సినిమాలను కంటిన్యూ చేస్తూనే ఉంది. హీరోయిన్ గా టబు ఇండస్ట్రీ లో అడుగు పెట్టి దాదాపుగా మూడు దశాబ్దాలు అవుతున్నా కూడా ఇంకా కూడా హీరోయిన్‌ పాత్రల్లో నటిస్తుంది అంటే కారణం ఈ అందం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా టబు తన అందంతో మరోసారి అందరికి షాక్ ఇచ్చింది. పాతికేళ్ల పడుచు అమ్మాయి మాదిరిగా టైట్‌ జీన్స్ ధరించి, సింపుల్‌ టాప్ లో స్కిన్‌ షో చేయకుండానే చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఈ ఫోటోని చూసిన ఎవరైనా ఈమె వయసు 51 అంటే నిజమా అంటూ నోరు వెళ్లబెట్టడం ఖాయం.

ఈ రేంజ్ లో అందంగా ఉన్న టబు మరో పదేళ్లు అయినా కూడా మూడు పదుల వయసు ముద్దుగుమ్మ అన్నట్లుగానే అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. అయిదు పదుల వయసు లోనే పాతికేళ్ల పరువాలతో కనిపించే ముద్దుగుమ్మలు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే టబు అరుదైన పీస్ అంటూ ఆమె అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.