Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్‌లో దేశ ద్రోహులు ఎక్కువ‌

ఈ సంద‌ర్భంగా దర్శకుడు తేజ మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య వేడెక్కించింది. జంకు అన్న‌దే లేకుండా మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే తేజ ఈసారి కూడా ముక్కుసూటిగా మాట్లాడారు.

By:  Tupaki Desk   |   1 Dec 2023 3:32 AM GMT
జూబ్లీహిల్స్‌లో దేశ ద్రోహులు ఎక్కువ‌
X

తెలంగాణలో ఎన్నికల హంగామా నడుమ సెలబ్రిటీలు పోలింగ్ బూత్ కి త‌ర‌లి రావ‌డం క‌న్నుల‌పండుగ‌ను త‌ల‌పించింది. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ స‌హా టాలీవుడ్ ప్రముఖులు ఈరోజు తమ ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా దర్శకుడు తేజ మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య వేడెక్కించింది. జంకు అన్న‌దే లేకుండా మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే తేజ ఈసారి కూడా ముక్కుసూటిగా మాట్లాడారు. 'ఎవరు తమ ఓటు హక్కును వినియోగించ‌కుండా దాటవేస్తారో.. మరీ ముఖ్యంగా ఓటు వేయాల‌నే ప్రాథమిక హ‌క్కును మ‌రిచారో వారిని `దేశ ద్రోహులు` (ద్రోహులు) అని పిలుస్తారు. రోడ్లు సరిగా లేవని.. పాఠశాలలు సరిగా లేవని.. తమ ప్రాంతంలో నీటి సమస్య ఉందని ఫిర్యాదు చేయడానికి వారికి సమయం ఉంది. కానీ బయటకు వచ్చి ఓటు వేయడానికి సమయం లేదు. వోట్లు వేయని వాళ్ళు అందరూ దేశ ద్రోహులు. .. అని అన్నారు.

'సాధారణంగా జూబ్లీహిల్స్‌లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో దేశ ద్రోహులు ఎక్కువగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేయాలి' అని తేజ అన్నారు. హైద‌రాబాద్ లో త‌క్కువ ఓటింగ్ శాతం న‌మోద‌వ్వ‌డంపై నెటిజ‌నుల్లో చ‌ర్చ సాగుతోంది. జూబ్లీహిల్స్ సెల‌బ్రిటీల నుద్ధేశించి తేజ చేసిన వ్యాఖ్య అర్థ‌వంత‌మైన‌దేన‌ని మ‌రోవైపు గుసగుస వినిపిస్తోంది.