Begin typing your search above and press return to search.

నాని, శ్రీకాంత్ ఓదెల.. ఎంతవరకు వచ్చింది..?

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డెబ్యూట్ గా చేసిన ఈ చిత్రం నాని కెరీర్‌లో మరో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

By:  Tupaki Desk   |   2 Oct 2024 3:40 PM GMT
నాని, శ్రీకాంత్ ఓదెల.. ఎంతవరకు వచ్చింది..?
X

నేచురల్ స్టార్ నాని గతేడాది వచ్చిన దసరా సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు. ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ప్రశంసలు రావడంతో పాటు, అనేక ప్రతిష్టాత్మక అవార్డులు కూడా దక్కాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డెబ్యూట్ గా చేసిన ఈ చిత్రం నాని కెరీర్‌లో మరో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అయితే మరోసారి వీరు కలిసి పని చేయబోతున్న విషయం తెలిసిందే.

దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్ట్‌కి నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కొత్త సినిమాకి సంబంధించి స్క్రిప్ కోసం గత సంవత్సరం నుంచే శ్రీకాంత్ ఓదెల కష్టపడుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయ్యిందని, ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం అక్టోబర్ 12 న హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది.

హిట్ 3 సినిమా షూటింగ్ పూర్తి చేసిన తరువాత, నాని ఈ కొత్త సినిమాకి ఏడాది కేటాయించనున్నాడట. 2024 లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నాని ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నాడని, దీనికోసం ప్రత్యేకంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి 100 కంటే ఎక్కువగా బడ్జెట్ కేటాయించారని సమాచారం. దసరాతో వచ్చిన విజయం వలన ఈ చిత్రంపై మరింత భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక సినిమాకి సంబంధించిన టెక్నీషియన్ల జాబితా కూడా చాలా ఆసక్తికరంగా ఉండనుందట. సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పనిచేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఎంపిక అవ్వనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఇకపోతే, నాని ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్నాడు. హిట్ 3 పూర్తి అయిన తర్వాత, ఈ కొత్త సినిమా ప్రారంభం కానుంది. నాని ఇప్పటికే పలు ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా త్వరలో రానున్నాయి. మరి శ్రీకాంత్ ఓదెల-నాని కాంబినేషన్ రెండోసారి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.