తమన్నా-విజయ్ వర్మ పెళ్లికి రెడీ అవుతున్నారా?
తమన్నా-విజయ్ వర్మ ప్రేమాయణం గురించి తెలిసిందే. మొదట్లో గుట్టుచప్పుడు కాకుండా జాగ్రత్ పడిన జంట తర్వాత ఒక్కసారిగా ఓపెన్ అయ్యారు.
By: Tupaki Desk | 13 Nov 2023 2:30 PMతమన్నా-విజయ్ వర్మ ప్రేమాయణం గురించి తెలిసిందే. మొదట్లో గుట్టుచప్పుడు కాకుండా జాగ్రత్ పడిన జంట తర్వాత ఒక్కసారిగా ఓపెన్ అయ్యారు. ఇద్దరు లవ్ లో ఉన్నామని పబ్లిక్ గానే ప్రకటించారు. ఆ తర్వాత జంట మధ్య అన్యోన్యత అంతకంతకు ఆసక్తికరంగా మారింది. ఇక వివాహ బంధంతో ఒకటి కావడమే ఆలస్యమని మీడియా కథనాలు వెడెక్కించాయి. అయితే సరిగ్గా ఇదే టైమ్ లో తమన్నా! పెళ్లి టాపిక్ తీసే సరికి స్కిప్ చేసే ప్రయత్నాలు చేసింది.
అందుకు ఇంకా సమయం ఉందంటూ...అప్పుడే అలాంటి ఆలోచన లేనట్లు చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఆలస్యం అమృతం విషం అన్న చందంగా మళ్లీ పెళ్లి గురించి సీరియస్ గానే మంతనాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. విజయ్ ని వివాహం చేసుకుని ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టడానికి ఇద్దరు సంసిద్దంగా ఉన్నట్లు గుసు గుస వినిపిస్తుంది.
తమన్నా వయసు కూడా 33 దాటడంతో కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి కూడా పెరగడంతో ఆలస్యం చేయడానికి అమ్మడు కూడా వెనకడుగు వేయడం లేదని కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. విజయ్ తో రిలేషన్ షిప్ ని వివాహ బంధంతో ముగింపు పలకమని మద్దతు లభించడంతో అమ్మడు కూడా పెద్దమాలకు కట్టుబడుతున్నట్లు సమాచారం. తుది నిర్ణయం విషయంలో మరోసారి విజయ్ తో మాట్లాడి తమన్నా పెళ్లి విషయంపై అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
వాస్తవానికి పెళ్లి విషయంలో తమన్నానే వెనకడుగు వేస్తుందని ఆమె మాటల్ని బట్టి గతంలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. ప్రియురాల్ని ఉద్దేశించి విజయ్ వర్మ చేసిన వ్యాఖ్యల్లో చెప్పలేనంత ప్రేమ కనిపించింది. పెళ్లికి విజయ్ సిద్దంగానే ఉన్నాడని అప్పుడే అర్దమైంది. తాజాగా తమన్నా నుంచి క్లారిటీ వచ్చేస్తే అమ్మడు తెలుగింట కోడలైపోతుంది. విజయ్ వర్మ హైదరాబాద్ కి చెందిన నటుడన్న సంగతి తెలిసిందే.