Begin typing your search above and press return to search.

బ్రేకప్‌ తర్వాత బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు..!

తెలుగులో వరుస సినిమాలతో స్టార్‌ హీరోలతో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   11 March 2025 11:34 AM IST
బ్రేకప్‌ తర్వాత బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు..!
X

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి సరిగ్గా రెండు దశాబ్దాలు అవుతుంది. టాలీవుడ్‌లో మంచు మనోజ్‌తో కలిసి 'శ్రీ' సినిమాలో నటించడం ద్వారా తెలుగు వారికి పరిచయం అయింది. హీరోయిన్‌గా తమన్నాకు మొదటి సినిమాతోనే నిరాశ మిగిలింది. తెలుగులో రెండేళ్ల తర్వాత మరోసారి ఛాన్స్ దక్కింది. శేఖర్‌ కమ్ముల హ్యాపీడేస్ సినిమాలో తమన్నాకు ఛాన్స్ దక్కడంతో కెరీర్‌ యూటర్న్‌ తీసుకుంది. హ్యాపీ డేస్ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో తమన్నాకి ఒక్కసారిగా టాలీవుడ్‌లో ఆఫర్లు వెళ్లువెత్తాయి. తెలుగులో వరుస సినిమాలతో స్టార్‌ హీరోలతో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.

టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే కోలీవుడ్‌లోనూ ఈ అమ్మడికి ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో సమాంతరంగా సినిమాలు చేస్తూ మిల్కీ బ్యూటీ సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ ట్యాగ్‌ను సొంతం చేసుకుంది. అప్పుడప్పుడు హిందీ సినిమాల్లోనూ నటించడం ద్వారా బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేసింది. బాలీవుడ్‌ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన తమన్నా తెలుగు, తమిళ్‌ సినిమాల కారణంగా అక్కడ రెండో సినిమాను చేయడంకు పది ఏళ్ల గ్యాప్ తీసుకుంది. పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న తమన్నా ఇటీవల ప్రియుడు విజయ్‌ వర్మతో విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అతడితో ప్రేమలో ఉన్న సమయంలో తమన్నా సినిమాలను ఆచితూచి ఎంపిక చేసుకుని వచ్చిందట.

విజయ్‌తో పెళ్లి కోసం ఎదురు చూసిన తమన్నా వచ్చిన సినిమా ఆఫర్లను కొన్నింటిని వదిలేసిందట. కానీ విజయ్ మాత్రం ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని చెప్పడంతో అతడి నుంచి బ్రేకప్‌ అయిందనే వార్తలు వస్తున్నాయి. విజయ్‌ నుంచి విడి పోయిన తర్వాత తమన్నా బిజీగా మారాలని ప్రయత్నిస్తుంది. వచ్చిన ఏ ఒక్క ఆఫర్‌ను వదిలి పెట్టకుండా, భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేస్తూ దూసుకు పోయే ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల కాలంలో తమన్నా మూడు ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. తమిళ్‌తో పాటు, తెలుగు, హిందీ ప్రాజెక్ట్‌లను ఈ అమ్మడు కమిట్‌ అయ్యేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇంతకు ముందు కేవలం ఐటెం సాంగ్స్‌ చేయడం పై ఆసక్తి చూపించిన తమన్నా ఇప్పుడు లీడ్‌ రోల్స్‌ చేసేందుకు, చిన్న సినిమాల్లో నటించేందుకు రెడీగా ఉందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈమె మరో రెండు లేదా మూడు సినిమాలకు సైన్ చేయబోతుందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తమన్నా అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేసే విధంగా వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది. అదే సమయంలో సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తుంది. బ్రేకప్ వార్తల నేపథ్యంలో తమన్నా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న తమన్నాను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఆమె సైలెంట్‌గా అక్కడ నుంచి వెళ్లి పోయింది.