పిక్‌టాక్ : మిల్కీ కాదు గోల్డెన్ బ్యూటీ
తాజాగా వారి కోసం మరో అందాల ఆరబోత ఫోటో షూట్‌ను ముద్దుగుమ్మ తమన్నా షేర్ చేసింది.
By: Tupaki Desk | 22 Nov 2024 7:30 AM GMTమిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం అవుతున్నా ఇప్పటికీ వరుస సినిమాలతో, సిరీస్‌లతో బిజీ బిజీగానే ఉంటుంది. తాజాగా ఈమె బాలీవుడ్లో చేసిన సినిమా ప్రమోషన్లో భాగంగా పలు ఆసక్తికర పోస్ట్‌లను, ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో ఈ అమ్మడు సినిమాలు చేయక పోయినా అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు, వీడియోలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట తమన్నాను ఎప్పుడూ అభిమానిస్తూ, ఫాలో అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. తాజాగా వారి కోసం మరో అందాల ఆరబోత ఫోటో షూట్‌ను ముద్దుగుమ్మ తమన్నా షేర్ చేసింది.
ఈసారి మిల్కీ బ్యూటీ తమన్నా క్లీ వేజ్ షో చేస్తూ బంగారు వర్ణపు డ్రెస్‌లో మెరిసింది. నేను గోల్డెన్ గర్ల్ అంటూ తనకు తాను ట్యాగ్ ఇచ్చుకుని అందమైన ఫోటోలను షేర్ చేసిన ముద్దుగుమ్మ తమన్నా పోటోలు ఎప్పటిలాగే వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో వచ్చి ఇన్నాళ్లు అయినా, మూడు పదుల వయసులోనూ మిల్కీ బ్యూటీ ఈ స్థాయి అందం ఎలా సాధ్యం అర్థం కాదు అంటూ నెట్టింట కొందరు కామెంట్ చేస్తూ ఉంటారు. తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో పాపం టాలీవుడ్ లో ఆఫర్లు దక్కక పోవడం విచారకరం అంటూ ఆవేదన చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా సీనియర్ హీరోలకు జోడీగా అయినా వరుసగా సినిమాలు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. వెబ్ సిరీస్‌లతో పాటు ప్రత్యేక పాటల్లోనూ కనిపించేందుకు ఎలాంటి మొహమాటం లేదని చెబుతూ ఉన్న ఈ అమ్మడు మరోసారి ఒక స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ ను చేసేందుకు రెడీ అయ్యిందని తెలుస్తోంది. హిందీలో ఈమె వరుసగా సినిమాలు చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఈమెకు సాలిడ్ సక్సెస్, మంచి గుర్తింపు దక్కించుకోలేక పోయింది.
హిందీతో పాటు ఇతర భాషల్లో ఆఫర్లు సొంతం చేసుకుంటూనే మరో వైపు సోషల్ మీడియాలో ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా తమన్నా తన ఉనికిని కాపాడుకుంటూ వస్తుంది. మరో అయిదు పదేళ్ల పాటు తమన్నా ఇదే అందంతో, ఇంతే బిజీగా ఉండాలని, మరిన్ని సినిమా ఆఫర్లు తమన్నాకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం మిస్ అయిన స్టార్ హీరోల సినిమాలు ఈమెకు మళ్లీ దక్కాలని కొందరు కోరుకుంటున్నారు. టాలీవుడ్లో మిల్కీ బ్యూటీ ఇదే అందంను కంటిన్యూ చేస్తే బిజీ అయ్యేనా చూడాలి.