తమన్నా.. నిజంగా పాలరాతి శిల్పమే..
బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనదైన గుర్తింపు... మంచి ఫేమ్ సంపాదించుకుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
By: Tupaki Desk | 2 March 2025 9:21 AM ISTహీరోయిన్ తమన్నా భాటియాకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనదైన గుర్తింపు... మంచి ఫేమ్ సంపాదించుకుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. పరిశ్రమలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా అదే క్రేజ్.. అదే గ్లామర్.. ఆమె సొంతమనే చెప్పాలి.
మరాఠీ బ్యూటీ అయిన తమన్నా.. నార్త్ టు సౌత్ అందరినీ అలరిస్తూ దూసుకుపోతోంది. కెరీర్ స్టార్టింగ్ లోనే టాలీవుడ్ ను ఓ రేంజ్ లో ఏలిందని చెప్పొచ్చు. స్టార్ హీరోలందరితో ఆడిపాడి తక్కువ టైమ్ లోనే ఎక్కువ గుర్తింపు సొంతం చేసుకుంది తమన్నా. ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తూనే.. స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తోంది.
రీసెంట్ గా రజినీ కాంత్ జైలర్ లో కావాలయ్యా పాటతో ఓ ఊపు ఊపేసింది తమన్నా. ఆమె డ్యాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కు అంతా ఫిదా అయిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ స్త్రీ 2లోని ఆజ్ కీ రాత్ సాంగ్ తో మరోసారి మెప్పించింది. తన అందచందాలు, స్టెప్పులతో ఓ రేంజ్ లో అందరినీ అలరించింది అమ్మడు.
అయితే కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో తమన్నా చేసే సందడి వేరే లెవెల్. ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటోంది. తాజాగా మరో బ్యూటిఫుల్ పిక్స్ తో తళుక్కుమంది అమ్మడు. వైట్ కలర్ మిడ్డీ డ్రస్ లో తమన్నా అదరగొట్టేసిందనే చెప్పాలి. క్లాసీ లుక్ లో తన గ్లామరస్ స్కిన్ తో మైండ్ బ్లాక్ చేసేసింది.
బ్లాక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న వైట్ డ్రెస్ అదిరిపోగా.. గ్లాసీ మేకప్ తో ఫుల్ షైనీగా కనిపించి క్లీన్ బౌల్డ్ చేస్తుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. రకరకాల పోజులను పోస్ట్ చేసిన తమన్నా.. తెల్ల పావురాల ఎమోజీలను క్యాప్షన్ గా ఇచ్చింది. ప్రస్తుతం తమన్నా కొత్త పిక్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పిక్స్ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సో షైనీ అని చెబుతున్నారు. పాలరాతి శిల్పంలా ఉన్నారని, నిజంగా మిల్కీ బ్యూటీనే అని కొనియాడుతున్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో ఓదెల 2 మూవీ చేస్తుండగా.. ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. అటు బాలీవుడ్ లో డార్లింగ్ పార్ట్ నర్స్ తో త్వరలోనే సందడి చేయనుంది.