ప్రేమలో ఉన్నప్పుడే హ్యాపీగా ఉన్నా: తమన్నా
ఈ నేపథ్యంలోనే ఇద్దరూ తమ సోషల్ మీడియాలో వారిద్దరికీ సంబంధించిన ఫోటోలను డిలీట్ చేశారంటున్నారు.
By: Tupaki Desk | 7 March 2025 6:30 PMహీరోయిన్ తమన్నా భాటియా, విజయ్ వర్మ మొన్నటివరకు అన్నిచోట్లా కలిసి తెగ తిరిగారు. త్వరలో పెళ్లి చేసుకుని ఒకటవుతారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు వీరిద్దరికీ బ్రేకప్ అయిందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ తమ సోషల్ మీడియాలో వారిద్దరికీ సంబంధించిన ఫోటోలను డిలీట్ చేశారంటున్నారు.
అయితే వారిద్దరూ సోషల్ మీడియాలో ఫోటోలను డిలీట్ చేయడంతో అందరూ అలా అనుకుంటున్నారు తప్పించి ఈ విషయంలో తమన్నా కానీ విజయ్ కానీ ఎక్కడా క్లారిటీ ఇచ్చి చెప్పింది లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ప్రేమ, రిలేషన్‌షిప్ మధ్య ఉన్న తేడాను తెలిపింది.
ప్రేమ, రిలేషన్‌షిప్ విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారని, ప్రేమకి ఎప్పుడూ రూల్స్ ఉండకూడదని, వన్ సైడ్ అయినా, టూ సైడ్స్ అయినా ఎప్పుడూ ప్రేమలో కండిషన్స్ ఉండకూడదని చెప్పంది. మీ భాగస్వామి పై మీరు అంచనాలు పెట్టుకోవడం స్టార్ట్ చేశారంటే ఆ రిలేషన్ బిజినెస్ అవుతుందని, నేనొకటి అనుకుంటే నువ్వొకటి చేశావని ప్రతీసారీ లిస్ట్ రాసుకోవాల్సి వస్తుందని చెప్పింది.
లవ్‌కీ, రిలేషన్‌కీ మధ్య తేడా ఉందని, ప్రేమ పుట్టాకే బంధం మొదలవుతుందని, ఆ ప్రేమకు ఎలాంటి కండిషన్స్ ఉండకూడదని, అది పేరెంట్స్ మధ్యలోనైనా, ఫ్రెండ్స్ మధ్యలోనైనా, పెట్స్ విషయంలోనైనా అని చెప్పింది. తాను ఎవరినైనా ప్రేమిస్తే వారికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తానని, వారికి నచ్చినట్టు వారిని బతకనిస్తానని తమన్నా చెప్పుకొచ్చింది.
అయితే తాను సింగిల్ గా ఉన్నప్పటి కంటే రిలేషన్‌షిప్ లో ఉన్నప్పుడే ఎక్కువ హ్యాపీగా ఉన్నానని చెప్పిన తమన్నా ఎవరికైనా సరైన తోడు దొరికితే అంతకంటే కావాల్సిందేముంటుందని ఆమె ప్రశ్నించింది. కానీ భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు తెలివిగా వ్యవహరించాలని, వారి ప్రభావం మన జీవితంపై చాలా పడుతుందని తమన్నా తెలిపింది.