Begin typing your search above and press return to search.

పిల్లల్ని కనడానికి భయపడుతున్న త‌మ‌న్నా

విజ‌య్ వ‌ర్మ‌తో రిలేష‌న్ లో ఉన్న త‌మ‌న్నా పిల్ల‌ల్ని క‌న‌డం గురించి వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

By:  Tupaki Desk   |   9 Sep 2024 9:30 PM GMT
పిల్లల్ని కనడానికి భయపడుతున్న త‌మ‌న్నా
X

త‌మన్నా భాటియా.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సౌత్ లో అగ్ర క‌థానాయిక‌గా ఎదిగిన త‌మ‌న్నా, ఇటీవ‌ల హిందీ చిత్ర‌సీమ‌లోను అవ‌కాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం `స్త్రీ 2`లో త‌న ప్ర‌త్యేక గీతం విజ‌యాన్ని, సినిమా అఖండ విజ‌యాన్ని ఆస్వాధిస్తోంది. స్త్రీ2లోని తాజా ట్రాక్ `ఆజ్ కీ రాత్`లో త‌మ‌న్నా కిల్ల‌ర్ మూవ్స్ యూత్‌లో మ‌రోసారి చ‌ర్చ‌గా మారాయి. ఇటీవ‌ల త‌మ‌న్నా మీడియాలతో స‌మావేశ‌మ‌వుతూ చాలా విష‌యాల‌ను ముచ్చ‌టిస్తోంది. విజ‌య్ వ‌ర్మ‌తో రిలేష‌న్ లో ఉన్న త‌మ‌న్నా పిల్ల‌ల్ని క‌న‌డం గురించి వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇటీవల రాజ్ షమణితో పాడ్ కాస్ట్ లో జరిగిన సంభాషణలో తమన్నా తనకు పిల్లల‌ను క‌న‌డంపై భయాందోళ‌న‌లు ఉన్నాయని వ్యాఖ్యానించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. పిల్లవాడు వృద్ధి చెందడానికి అవసరమైన ప్రేమ, సంరక్షణ, పోషణను తాను ఎలా కొలవగలనని ఆలోచించడంతో ఆందోళన ఉత్పన్నమవుతోందని తెలిపింది. తన తల్లిదండ్రులు తనను ఎంతగానో ముద్దుగా చూసుకున్నారని, అది తానూ పేరెంట్‌గా మారడంలో భ‌యాన్ని సృష్టించింద‌ని పేర్కొంది.

ఉత్తమ సంబంధాలపై సలహా కోర‌గా సంబంధాలలో `సమస్యాత్మక డివిజ‌న్స్` ఉన్నాయ‌ని త‌మ‌న్నా అన్నారు. సంబంధంలో ప్రారంభంలో గుర్తించిన సమస్యలు అలాగే ఉండవచ్చని గమనించిన‌ట్టు తెలిపారు. ఎందుకంటే ఈ సవాళ్లు మారని పరిష్కారం లేని రోడ్‌బ్లాక్‌లుగా మారుతాయి. ఎందుకంటే పట్టుదలల‌కు పోతుంటాం అని తెలిపారు. త‌మ‌న్నా గ‌త ప్రేమాయ‌ణాల గురించి ఇటీవ‌ల వ్యాఖ్యానించడం చ‌ర్చ‌గా మారింది. న‌టుడు విజయ్ వర్మతో త‌మ‌న్నా అనుబంధం ఇటీవ‌ల ఎక్కువ‌గా హెడ్ లైన్స్ లో నిలిచింది. ఇలాంటి స‌మ‌యంలో పిల్ల‌ల్ని క‌న‌డంపై తన ఆందోళ‌న గ‌మ‌నించ‌ద‌గిన‌ది. ఒత్తిళ్ల జీవితంలో కూడా పిల్ల‌ల‌కు పేరెంట్ పూర్తి ప్రేమ‌ను పంచాల‌నేది త‌మ‌న్నా ఉద్ధేశం. కెరీర్ మ్యాట‌ర్‌కి వ‌స్తే.. తమన్నా `ఓదెలా 2` విడుదలకు సిద్ధమవుతోంది. మ‌రిన్ని ప్రాజెక్టులు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.