Begin typing your search above and press return to search.

శ్రీదేవిలా న‌టించాల‌నుంది!

ఆన్ స్క్రీన్ పై ఎలాంటి త‌ర‌హా పాత్ర‌లు పోషించాల‌నుంది అని అడిగిన‌ప్పుడు త‌మ‌న్నా క్ష‌ణం ఆలోచించ‌కుండా వెంట‌నే శ్రీదేవి పేరు చెప్పింది.

By:  Tupaki Desk   |   17 March 2025 1:21 PM IST
శ్రీదేవిలా న‌టించాల‌నుంది!
X

అతిలోక సుంద‌రి శ్రీదేవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎంతో మంది సెల‌బ్రిటీలు సైతం ఆమెను అభిమానిస్తుంటారు. రీసెంట్ గా ఓ ఫ్యాష‌న్ టూర్ లో పాల్గొన్న త‌మ‌న్నా భాటియాకు ఓ ప్ర‌శ్న ఎదురైంది. ఆన్ స్క్రీన్ పై ఎలాంటి త‌ర‌హా పాత్ర‌లు పోషించాల‌నుంది అని అడిగిన‌ప్పుడు త‌మ‌న్నా క్ష‌ణం ఆలోచించ‌కుండా వెంట‌నే శ్రీదేవి పేరు చెప్పింది.

శ్రీదేవి 2018లో దుర‌దృష్ట‌వ‌శాత్తూ బాత్ ట‌బ్ లో ప‌డి నీటిలో మునిగి చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. శ్రీదేవిపై త‌మ‌న్నా త‌న అభిమానాన్ని ఈ ఈవెంట్ లో వెల్ల‌డించింది. శ్రీదేవి సూప‌ర్ ఐకానిక్ అని, ఆన్ స్క్రీన్ శ్రీదేవిగా న‌టించాల‌ని కోరుకుంటున్న‌ట్టు త‌మ‌న్నా తెలిపింది. శ్రీదేవి మేడ‌మ్ ను ఆరాధించే వ్య‌క్తుల్లో తాను కూడా ఒక‌ర‌ని త‌మ‌న్నా ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చింది.

స్టీరియోటైప్ పాత్రల నుంచి కామెడీ, డ్రామా వ‌ర‌కు ఎన్నో జాన‌ర్ల‌లో ప‌లు విభిన్న పాత్ర‌ల‌ను పోషించి ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే మొద‌టి మ‌హిళా సూప‌ర్ స్టార్ గా శ్రీదేవి గుర్తింపు పొందార‌ని త‌మ‌న్నా చెప్పింది. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో శ్రీదేవి 50 సంవ‌త్స‌రాల‌కు పైగా వివిధ రంగాల్లో కొన‌సాగార‌ని, మిస్ట‌ర్ ఇండియా, సద్మా, హిమ్మ‌త్ వాలా, ఖుదా గ‌వా, లాడ్లా, ఇంగ్లీష్ వింగ్లీష్, మామ్ లాంటి గుర్తుండిపోయే సినిమాల్లో శ్రీదేవి న‌టించార‌ని త‌మ‌న్నా తెలిపింది.

ఇక త‌మ‌న్నా విష‌యానికొస్తే అమ్మ‌డు ఆఖ‌రిగా నీర‌జ్ పాండే ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ సికింద‌ర్ కా ముఖ‌ద్ద‌ర్ సినిమాలో న‌టించింది. ఈ సినిమాలో జిమ్మీ షీర్ గిల్, అవినాష్ తివారీ, రాజీవ్ మెహ‌తా మ‌రియు దివ్య ద‌త్తా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌స్తుతం త‌మ‌న్నా తెలుగులో చేస్తున్న ఓదెల‌2 త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అశోక్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఓదెల‌2ను సంప‌త్ నంది క‌థ అందిస్తూ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త‌మ‌న్నా నాగ సాధువుగా క‌నిపించ‌నుంది. ఓదెల‌2 పై త‌మ‌న్నా చాలానే ఆశ‌లు పెట్టుకుంది. దానికి త‌గ్గ‌ట్టే రీసెంట్ గా రిలీజైన ఓదెల‌2 టీజ‌ర్ కూడా సినిమాపై అంచ‌నాల్ని పెంచింది.