తమన్నా.. ఇప్పటికే 2సార్లు బ్రేకప్ అయిందట..
ఈ విషయాన్ని వాళ్లే పలుమార్లు తెలిపారు. అయితే రిలేషన్ షిప్ విషయంలో తనకు కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లు ఉన్నాయని తమన్నా తాజాగా తెలిపింది.
By: Tupaki Desk | 8 Sep 2024 4:30 PM GMTస్టార్ హీరోయిన్ తమన్నా.. అటు నార్త్.. ఇటు సౌత్ లో వరుస అవకాశాలు అందుకుని దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా నటిస్తోంది. మంచు మనోజ్ శ్రీ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన మిల్కీ బ్యూటీ.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా సినీ ఇండస్ట్రీలో అదరగొడుతోంది అమ్మడు.
రీసెంట్ గా తన చిత్రాలతో అలరిస్తోంది తమన్నా. డైరెక్టర్ సుందర్ సి తీసిన బాక్ మూవీలో యాక్ట్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీలో కావాలయ్యా అంటూ అదరగొట్టింది. గ్లామర్ షోతో ఫిదా చేసింది. రీసెంట్ గా వచ్చిన స్త్రీ 2లో ఐటెం సాంగ్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఓదెల-2 షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే ఆ మూవీ నుంచి రిలీజ్ అయిన తమన్నా పోస్టర్లు.. మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
కాగా, తమన్నా.. కొన్ని నెలలుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ టైమ్ లో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని వాళ్లే పలుమార్లు తెలిపారు. అయితే రిలేషన్ షిప్ విషయంలో తనకు కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లు ఉన్నాయని తమన్నా తాజాగా తెలిపింది. తన లైఫ్ లో రెండు బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయని చెప్పింది. పలు కారణాల వల్ల వర్కౌట్ అవ్వలేదని, అందుకే అలా అయిందని పేర్కొంది.
టీనేజ్ లో తనకు ఫస్ట్ బ్రేకప్ జరిగిందని తెలిపింది తమన్నా. అప్పుడు చాలా బాధపడ్డానని చెప్పింది. ఒక పర్సన్ కోసం తన లైఫ్ వదులుకోవడం నచ్చలేదని పేర్కొంది. అందుకే బ్రేకప్ చెప్పుకున్నట్లు వెల్లడించింది. తాను జీవితంలో ఏదైనా కొత్తగా సాధించాలనుకుంటానని తెలిపింది. ఫస్ట్ బ్రేకప్ జరిగిన కొన్ని నెలల తర్వాత మరో వ్యక్తితో మూవ్ అయ్యానని చెప్పింది. కానీ అతడు కూడా తనకు సెట్ కాడని అనిపించిందని తమన్నా తెలిపింది.
ముఖ్యంగా ప్రతి చిన్న మ్యాటర్ కు అబద్ధం చెప్పే వాళ్లంటే తనకు నచ్చదని తెలిపింది. అలాంటి వారికి దూరంగా ఉండాలని ఎప్పుడూ అనుకుంటానని చెప్పింది. అందుకే ఆ వ్యక్తితో రిలేషన్ షిప్ కంటిన్యూ చేస్తే చాలా డేంజర్ అని భావించినట్లు వెల్లడించింది. అలా ఆ పర్సన్ తో లవ్ కహానీ ముగిసిపోయిందని తెలిపింది. మొత్తానికి తన లైఫ్ లో రెండు బ్రేకప్ స్టోరీలు ఉన్నట్లు వెల్లడించింది. కానీ విజయ్ వర్మతో డేటింగ్ విషయంపై స్పందించలేదు.