Begin typing your search above and press return to search.

ప్రేమ ఎప్పుడూ వ్యాపారంలా మారకూడదు : తమన్నా

నటుడు విజయ్ వర్మతో తమన్నా చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తుంది. ఇద్దరు పలు కార్యక్రమాల్లో కనిపించడంతో పాటు, ఒక వెబ్‌ సిరీస్‌లోనూ కలిసి నటించారు.

By:  Tupaki Desk   |   8 March 2025 9:43 AM
ప్రేమ ఎప్పుడూ వ్యాపారంలా మారకూడదు : తమన్నా
X

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. గత కొన్నాళ్లుగా ఈ అమ్మడు చేస్తున్న సినిమాల సంఖ్య చాలా తక్కువ అయింది. మెయిన్‌ హీరోయిన్‌గా ఆఫర్లు రాకపోవడంతో ప్రత్యేక పాటలు చేయడంతో పాటు మ్యూజిక్ వీడియోల్లోనూ నటిస్తుంది. మరో వైపు ఈమె వెబ్‌ సిరీస్‌ల వైపు అడుగులు వేసింది. ఒక వైపు కెరీర్ గందరగోళంలో ఉంటే మరో వైపు ఈ అమ్మడు వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఈ అమ్మడు కొన్ని కారణాల వల్ల బ్రేకప్‌ అయి ప్రియుడితో విడి పోయిందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు బ్రేకప్‌ వార్తలు నిజమేనా అనే అనుమానం కలిగిస్తుంది.

నటుడు విజయ్ వర్మతో తమన్నా చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తుంది. ఇద్దరు పలు కార్యక్రమాల్లో కనిపించడంతో పాటు, ఒక వెబ్‌ సిరీస్‌లోనూ కలిసి నటించారు. విజయ్‌ వర్మ బాలీవుడ్‌లో బిజీ స్టార్‌గా వరుస సినిమాలు చేస్తూ, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. నటుడిగా బిజీగా ఉన్న ఈ సమయంలో విజయ్ వర్మ పెళ్లిపై ఆసక్తి చూపడం లేదని, కానీ తమన్నా మాత్రం వెంటనే పెళ్లి చేసుకుని సెటిల్‌ కావాలని భావించిందట. పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో బ్రేకప్‌ అయ్యారని తెలుస్తోంది. పెళ్లికి మరో మూడు నాలుగు ఏళ్లు సమయం కోరడంతో తమన్నా అతడికి దూరం కావాలని నిర్ణయించుకుంది అనేది బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్న పుకారు.

తాజాగా మిల్కీ బ్యూటీ సోషల్‌ మీడియాలో... ప్రేమలో ఎమోషన్స్‌ ఉంటాయి. ఇద్దరి మధ్య ఎమోషన్స్ ఉండాలే కానీ ఎదుటి వ్యక్తి నా కోసం అది చేయాలి, ఇలా చేయాలని అంచనాలు ఉండకూడదు. అలా ఉన్నప్పుడు అది ప్రేమ కాకుండా వ్యాపారం అవుతుంది. ప్రేమ ఎప్పుడు అయితే వ్యాపారంలా మారుతుందో అప్పుడు కలిసి ఉండటం కంటే విడిపోవడం ఉత్తమం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎదుటి వారికి స్వేచ్చ ఇచ్చే విధంగా ప్రేమ ఉండాలి. అంతే తప్ప ఒకరిని ఒకరు కట్టడి చేసుకునే విధంగా ప్రేమ ఉండకూడదు అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. రిలేషన్‌లో ఉన్నప్పుడు అభిప్రాయాలకు విలువ ఉండకుంటే ఆ రిలేషన్‌కి అర్థం లేదని చెప్పుకొచ్చింది.

రిలేషన్‌లో ఉన్నప్పటి కంటే ఆ రిలేషన్ షిప్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ప్రేమించే సమయంలో సంతోషం ఉంటుంది, కానీ కొన్నాళ్ల తర్వాత అది వ్యాపారంలా మారాడం, ఒకరి పై ఒకరు అజమాయిషీ పెరగడం వల్ల ఇబ్బందులు మొదలు అవుతాయి. అలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రేమలో కొనసాగడం సాధ్యం కాదు. అందుకే ప్రేమలో కొనసాగలేరని తమన్నా ఇండైరెక్ట్‌గా బ్రేకప్‌ విషయాలను చెప్పుకొచ్చింది. ఒకరి నిర్ణయాలను ఒకరు సమర్థించుకుంటేనే ప్రేమ విజయం సాధిస్తుందని తమన్నా అభిప్రాయం వ్యక్తం చేసింది.