Begin typing your search above and press return to search.

అలాంటి ప్ర‌చారం వ‌ద్దంటూ త‌మన్నా రిక్వెస్ట్!

పాండిచ్చేరి లో జ‌రిగిన క్రిప్టో క‌రెన్సీ మోసానికి సంబంధించి హీరోయిన్లు త‌మ‌న్నా, కాజ‌ల్ అగ‌ర్వాల్ విచారించాల‌ని పాండిచ్చేరి పోలీసులు నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 March 2025 12:39 PM IST
అలాంటి  ప్ర‌చారం వ‌ద్దంటూ త‌మన్నా రిక్వెస్ట్!
X

పాండిచ్చేరి లో జ‌రిగిన క్రిప్టో క‌రెన్సీ మోసానికి సంబంధించి హీరోయిన్లు త‌మ‌న్నా, కాజ‌ల్ అగ‌ర్వాల్ విచారించాల‌ని పాండిచ్చేరి పోలీసులు నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. క్రిప్టో క‌రెన్సీలో పెట్టుబ‌డి పెడితే అధిక లాభం పొంద‌వ‌చ్చ‌ని ఆశ చూపి పాండిచ్చేరికి చెందిన ప‌ది మంది నుంచి సుమారు 2.40 కోట్లు వ‌సూలు చేసి మోసానికి పాల్ప‌డిన‌ట్లు అశోక‌న్ అనే విశ్రాంతి ఉద్యోగి ఫిర్యాదు చేసారు.

క్రిప్టో క‌రెన్సీ కోయంబ‌త్తూరు ప్ర‌ధాన కేంద్రంగా ప్రారంభ‌మైంది. ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో త‌మ‌న్నా, ఇత‌ర ప్ర‌ముఖులు కొంద‌రు పాల్గొన్నారు. మ‌హాబ‌లిపురం ఓ స్టార్ హోట‌ల్ లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా హాజ‌రైంది. అటుపై ముంబైలో పార్టీ నిర్వ‌హించి వేలాది మంది నుంచి డబ్బు సేక‌రించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి నితిష్ జైన్, అర‌వింద్ కుమార్ ల‌ను అరెస్ట్ కూడా చేసారు.

కేసు ద‌ర్యాప్తులో భాగంగా త‌మ‌న్నా, కాజ‌ల్ ని కూడా పోలీసులు విచారించాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో వాళ్లిద్ద‌రికి నోటీసులు కూడా జారీ అవుతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అయితే ఈ ప్ర‌చారాన్ని త‌మ‌న్నా ఖండించింది. ఇదంతా త‌ప్పుడు ప్ర‌చార‌మంటోంది. ఇలాంటి త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు , వీడియోలు వేయోద్దు అంటూ మీడియాను అభ్య‌ర్దించింది. చ‌ట్ట‌ప‌రమైన చ‌ర్య‌లు తీసుకునేందుకు ప‌రిశీల‌న చేస్తున్న‌ట్లు తెలిపింది.

`క్రిప్టో క‌రెన్సీ కేసులో నేను ఉన్న‌ట్లు వార్త‌లొస్తున్న విష‌యం నాదృష్టికి వ‌చ్చింది. ఇలాంటి త‌ప్పుడు క‌థ‌న‌లు, నివేదిక‌లు న‌మ్మోద్దు. వాటిని మీడియా సంస్థ‌ల్లో ప్ర‌సారం చేయోద్దు. అయితే ఇదంతా త‌ప్పుడు ప్ర‌చార‌మా? కాదా? అన్న‌ది పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇంకా కాజ‌ల్ అగ‌ర్వాల్ స్పందించ‌లేదు. ఆమె నుంచి ఎలాంటి స్పందనొస్తుందో చూడాలి.