నా శరీరంలో అణువణువును తాకుతాను: తమన్నా
ముఖ్యంగా తమన్నా యూనిక్ బాడీ షేప్స్, పిచ్చెక్కించే మూవ్స్ కారణంగా కుర్రకారు కలల రాణిగా మారింది.
By: Tupaki Desk | 2 Feb 2025 5:30 PM GMTజైలర్ లో 'కావాలా' చార్ట్ బస్టర్‌గా నిలిచాక, తమన్నా భాటియా స్పెషల్ నంబర్ల క్వీన్ గా మారింది. ఆ తర్వాత స్త్రీ 2లో 'ఆజ్ కి రాత్' మరో సంచలనంగా మారింది. ఈ చార్ట్ బస్టర్ పాటలో తమన్నా నృత్యానికి యూత్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా తమన్నా యూనిక్ బాడీ షేప్స్, పిచ్చెక్కించే మూవ్స్ కారణంగా కుర్రకారు కలల రాణిగా మారింది. డెబ్యూ నటి రాషా తడానీ ఆజాద్ ప్రివ్యూలో తమన్నాను 'ఆంటీ' అని పిలిచేసినా తన అందంలో మెచ్యూరిటీ, ఆకృతిలో కిక్ రేంజ్‌ని అది ఆవిష్కరించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన శరీరాకృతిపై తమన్నా తనపై తానే చేసిన కామెంట్ వెబ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ వ్యాఖ్య ఏమిటి? అంటే.. ''నా శరీరంలోని ప్రతి భాగానికి ధన్యవాదాలు...అందానికి థాంక్స్'' అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యను బట్టి తమన్నా తన అందం, ఆకృతిపై ఎంత నమ్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నా శరీరానికి నేను ఎంతో ఆనందిస్తాను.. దానిని ఆరాధిస్తున్నాను. నేను నా శరీరంలోని ప్రతి భాగాన్ని తాకుతాను. అన్నిటినీ తట్టుకుని నా కోసం నిలబడిన ఈ శరీరానికి కృతజ్ఞతలు అని తెలిపింది. తన శరీర అందాన్ని కాపాడుకునేందుకు తమన్నా ఎంతగా పాటుపడుతుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
శేఖర్ కమ్ముల 'హ్యాపీడేస్'లో నటించినప్పుడు తమన్నా భాటియా టీన్ లుక్ కి, ఇప్పటి తమన్నా లుక్ కి ఎంత వేరియేషన్ ఉందో యూత్ ఇట్టే చెప్పేయగలదు. నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం సాగిస్తున్న తమన్నా తొందర్లోనే పెళ్లాడుతుందని కథనాలొచ్చినా, ఊహించని రీతిలో ఇటీవల బ్రేకప్ పుకార్లు ఆశ్చర్యపరిచాయి. కానీ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేందుకు తమన్నా పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. వృత్తిగతంగా అన్ని విషయాలను తమన్నా భాటియా షేర్ చేస్తోంది.