Begin typing your search above and press return to search.

రాధా-కృష్ణ ఫోటోషూట్ లైంగిక‌త దుమారం.. చిక్కుల్లో త‌మ‌న్నా!

ఇటీవ‌ల శ్రీ‌కృష్ణ జ‌న్మాష్ఠ‌మి సంద‌ర్భంగా రాధా-కృష్ణ థీమ్డ్ ఫోటోషూట్ ని త‌మ‌న్నా ఇంట‌ర్నెట్ లో షేర్ చేసింది

By:  Tupaki Desk   |   5 Sep 2024 5:14 PM GMT
రాధా-కృష్ణ ఫోటోషూట్ లైంగిక‌త దుమారం.. చిక్కుల్లో త‌మ‌న్నా!
X

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా తాజా ఫోటోషూట్ పై తీవ్ర దుమారం చెల‌రేగుతోంది. ఇటీవ‌ల శ్రీ‌కృష్ణ జ‌న్మాష్ఠ‌మి సంద‌ర్భంగా రాధా-కృష్ణ థీమ్డ్ ఫోటోషూట్ ని త‌మ‌న్నా ఇంట‌ర్నెట్ లో షేర్ చేసింది. కానీ ఈ భామ `రివీలింగ్` దుస్తులు ధ‌రించి, హ‌ద్దు మీరి శృంగారాన్ని ఒల‌క‌బోయ‌డంతో `రాధ‌-కృష్ణ` భ‌క్తులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. సాంప్ర‌దాయం మాటున లైంగిక‌త‌ను ప్రేరేపించింద‌ని త‌మ‌న్నాపై చెల‌రేగారు. ఈ ఎదురుదెబ్బ తర్వాత త‌మ‌న్నా `రాధా ఫోటోషూట్‌`ను సోష‌ల్ మీడియాల నుంచి తొలగించింది.

ప్రముఖ ఫ్యాషన్ లేబుల్ ని ప్ర‌మోట్ చేస్తూ రాధా-కృష్ణ ఫోటోషూట్‌లో భాగంగా వరుస ఫోటోలను షేర్ చేసిన త‌మ‌న్నాపై స‌హ‌జంగానే విమ‌ర్శ‌లొచ్చాయి. రాధను `లైంగికానికి గురిచేసావు` అంటూ ప‌లువురు నెటిజ‌నులు ఆరోపించారు. శ్రీకృష్ణుడు- రాధల మధ్య ప్రేమ తాలూకా వివిధ దశలను చూపించిన `లీలా: ది డివైన్ ఇల్యూషన్ ఆఫ్ లవ్` ఫోటోషూట్ నిజంగా శృంగార భ‌రితంగా సాగింది. ఫ్యాషన్ డిజైనర్ కరణ్ తోరానీ డిజైన్ కి తమన్నా ప్ర‌మోష‌న్ ఇది. కానీ ఇది లార్డ్ కృష్ణ‌- రాధ అభిమానుల‌ను తీవ్రంగా క‌ల‌చివేసింది.

ఫోటోషూట్ లో త‌మ‌న్నాలోని ఒరిజిన‌ల్ రాధ బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని, ఇది త‌ప్పుడు వ్య‌వ‌హారం అని విమ‌ర్శిస్తూ ఇంటర్నెట్‌లోని ఒక సెక్ష‌న్ తమన్నాను, డిజైనర్‌ను కూడా దూషిస్తూ కౌంట‌ర్ వేసారు. ``మీ అమ్మకాల కోసం మా ప్రియమైన రాధా రాణి - శ్రీ కృష్ణుడి స్వచ్ఛమైన సంబంధాన్ని లైంగికంగా మార్చుకోవడం మానేయండి! మూర్ఖులారా! మీకు ఎంత ధైర్యం?`` అంటూ త‌మ‌న్నా, తొరానియోల‌ను ట్యాగ్ చేసారు. మరొక నెటిజన్ ఒక వీడియోను షేర్ చేసి రాధను తెరపై చిత్రీకరించడానికి `రివీలింగ్` దుస్తులను ధరించినందుకు అత‌డు వ్యంగ్యంగా తిడుతూ క‌నిపించాడు. ఆన్‌లైన్‌లో తీవ్ర విమ‌ర్శ‌లు ప‌రిశీలించాక‌ తమన్నా - టోరానీ లేబుల్ ఇద్దరూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి ఫోటోలు, వీడియోలను తొలగించారు. ఈ పేజీలో కామెంట్ల‌ను కూడా పరిమితం చేసారు. ఈ వివాదంపై తమన్నా ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

నిజానికి త‌మ‌న్నా ఈ క‌మ‌ర్షియ‌ల్ ఫోటోషూట్ వెన‌క చాలా పెద్ద ప్లాన్ ఉంద‌ని కూడా కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. దాదాపు 170 దేశాల్లో విస్త‌రించి ఉన్న ఇస్కాన్- హ‌రేకృష్ణ ఉద్య‌మంలోని భ‌క్తులంద‌రి దృష్టిని ఈ ఫోటోషూట్ ఆక‌ర్షించింది. వారంతా త‌మ‌న్నాపై తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.... తమన్నా ఇటీవల బ్లాక్‌బస్టర్ చిత్రం స్ట్రీ 2 లో కనిపించింది. ఈ చిత్రంలో `ఆజ్ కీ రాత్` అనే పాటలో కనిపించింది. త‌మ‌న్నా క‌ద‌లిక‌లు భంగిమ‌లు దుమారం రేపాయి. జాన్ అబ్రహం న‌టించిన‌ వేదాలో కూడా న‌టించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.