Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటీ పని అయిపోయినట్టేనా..?

మిల్కీ బ్యూటీ తమన్నా నెక్స్ట్ ఇయర్ తో తన రెండు దశాబ్దాల సినీ కెరీర్ పూర్తి చేసుకోబోతుంది.

By:  Tupaki Desk   |   27 Dec 2024 6:30 AM GMT
మిల్కీ బ్యూటీ పని అయిపోయినట్టేనా..?
X

మిల్కీ బ్యూటీ తమన్నా నెక్స్ట్ ఇయర్ తో తన రెండు దశాబ్దాల సినీ కెరీర్ పూర్తి చేసుకోబోతుంది. ఈ 20 ఏళ్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది అమ్మడు. తమన్నా సినిమాలో ఉంది అంటే అటు గ్లామర్, ఇటు పాత్రకు తగిన అభినయం రెండు కూడా కవర్ అవుతాయి. సినిమాల పరంగా తనకు ఛాన్స్ వచ్చిన ఎలాంటి ఆఫర్ ని కూడా వదలకుండా చేస్తూ వచ్చింది తమన్నా. సినిమాలో హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లో కూడా తన టాలెంట్ చూపించింది.

స్టార్స్ నుంచి యువ హీరోల దాకా తమన్నా నటిస్తూ వచ్చింది. సౌత్ లో స్టార్ రేంజ్ వచ్చాక బాలీవుడ్ వెళ్లి అక్కడ కూడా తన దూకుడు చూపించింది తమన్నా. అయినా కూడా ఇటు తెలుగు సినిమాలను మాత్రం వదలకుండా చేస్తూ వచ్చింది. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి టచ్ లో ఉంటూ వచ్చిన తమన్నా కెరీర్లో హై మూమెంట్స్ అన్నీ పూర్తైనట్టుగానే భావిస్తుంది.

ఈ మధ్య బాలీవుడ్ లో ఎక్కువగా వెబ్ సీరీస్ చేస్తున్న తమన్నా అక్కడ కాస్త తన గ్లామర్ అడ్డుగోడలు తొలగించినట్టు అనిపించింది. బీ టౌన్ ఆడియన్స్ ని తన బుట్టలో వేసుకునే ప్రయత్నంలో తమన్నా చేసిన ప్రయత్నాలు ఆమెకు బాగానే వర్క్ అవుట్ అయినట్టే ఉన్నాయి. ఐతే తెలుగులో మాత్రం తమన్నా గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. లాస్ట్ ఇయర్ భోళా శంకర్ చేసిన తమన్నా ఈ ఇయర్ తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. ఐతే ప్రస్తుతం ఓదెల 2 తో మరో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తుంది.

తమన్నా ఇప్పటికీ తనకు తగిన పాత్ర ఇస్తే అదరగొట్టేస్తా అని అంటుంది. ఐతే రోజుకొక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ టైం లో మళ్లీ పాత అందాలనే చూడాలని ఆడియన్స్ కోరుకోరు. ఈ కారణంతోనే సీనియర్ హీరోయిన్స్ కు పెద్దగా సినిమాలు లేకుండా పోతున్నాయి. తమన్నా కూడా వచ్చిన ఛాన్స్ చేస్తుంది తప్ప పెద్దగా ప్రయత్నాలు చేయట్లేదని తెలుస్తుంది. చూస్తుంటే సౌత్ లో ముఖ్యంగా తెలుగులో తమన్నా పని అయిపోయినట్టే అనిపిస్తుండగా ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆమె ఎప్పుడైనా కం బ్యాక్ ఇస్తుందనిఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి తమ్మూ తన ఫ్యాన్స్ కోరికని నిజం చేస్తుందా లేదా అన్నది చూడాలి. సంపత్ నంది ఓదెల 2 లో నాగ సాధుగా తమన్నా లుక్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి. సినిమా ఏం చేస్తుందో చూడాలి.