ప్లీజ్ దూరంగా పోండి.. ఎందుకలా తమ్మూ?
తమన్నా `ప్లీజ్ గో అవే` అంటోంది. అయితే ప్రజల్ని అలా దూరంగా ఎందుకు పొమ్మంటోంది? అంతగా ఏం జరిగింది? అంటే....
By: Tupaki Desk | 28 Feb 2025 12:30 AM ISTతమన్నా `ప్లీజ్ గో అవే` అంటోంది. అయితే ప్రజల్ని అలా దూరంగా ఎందుకు పొమ్మంటోంది? అంతగా ఏం జరిగింది? అంటే....
ఫిబ్రవరి 26న మహా శివరాత్రిని పురస్కరించుకుని శివుడికి తమన్నా నిష్ఠగా ప్రార్థనలు చేసింది. పూజలో భాగంగా శివలింగంపై తిలకం వేస్తూ క్లిప్ లో కనిపించింది. ఇదే కాదు... మహాకుంభ్ లో పాల్గొన్న ఫోటోని కూడా పోస్ట్ చేసింది. మీ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు... హర్ హర్ మహాదేవ్... హర్ హర్ గంగే! అని సోషల్ మీడియాల్లో తమన్నా రాసింది.
ఈ వారం ప్రారంభంలో మహాకుంభ్ పవిత్ర స్నానం తర్వాత కొన్ని ఫోటోలను తమన్నా షేర్ చేసింది. మహాకుంభ్ సమయంలో తాను ఆధ్యాత్మికత శక్తిని అనుభవంలోకి తెచ్చుకున్నానని తమన్నా రాసింది. నేను లక్షలాది మంది భక్తులు ఉన్న పవిత్ర సంగమం వద్ద నిలబడి ఆధ్యాత్మికత - సామూహిక శక్తిని అనుభవించాను. మహా కుంభ్ లో మనమంతా అనుసంధానమై ఉన్నామని గుర్తు చేస్తుంది.
తమన్నా ప్రస్తుతం తన సినిమా ఓదెలా 2 ని ప్రమోట్ చేస్తోంది. ఇటీవలే టీజర్ విడుదలైంది. దైవ శక్తి గురించిన చిత్రం #ఓదేలా2 టీజర్‌ను విడుదల చేస్తూ పవిత్ర స్నానం కోసం త్రివేణి సంగమంలో మునగడం ఈ రోజును మరింత ప్రత్యేకంగా చేసింది. దైవిక శక్తులు మనల్ని నడిపిస్తూ .. మనందరినీ కలుపుతూ ఉండుగాక. హర్ హర్ గంగే... అని అన్నారు. ఈ చిత్రం లో శివ శక్తి అనే సాధ్వి పాత్రను తమన్నా పోషిస్తోంది. ఓదేలా మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనేదే కథాంశం. తమన్నా టీషర్ట్ పై ప్లీజ్ గో అవే కేవలం ప్రచార స్టంట్ అంతే!