Begin typing your search above and press return to search.

రూ.800 కోట్ల వసూళ్లకి తమన్నా కారణమా?

బాలీవుడ్‌లో రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన స్త్రీ 2 సినిమా వలర్డ్‌ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   2 Dec 2024 6:52 AM GMT
రూ.800 కోట్ల వసూళ్లకి తమన్నా కారణమా?
X

బాలీవుడ్‌లో రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన స్త్రీ 2 సినిమా వలర్డ్‌ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న విషయం తెల్సిందే. దాదాపు ఎనిమిది వారాల పాటు స్త్రీ 2 జోరు కొనసాగుతూనే వచ్చింది. మొదటి వారంతో పోల్చితే ఆ తర్వాత వారం ఎక్కువ వసూళ్లు నమోదు అయ్యాయి. సౌత్‌లో పెద్దగా ప్రమోట్‌ చేయలేదు కానీ ఈజీగా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు అయ్యేవి. హర్రర్‌ కామెడీ కాన్సెప్ట్‌తో వచ్చిన స్త్రీ 2 సినిమాలో తమన్నా ఐటెం సాంగ్‌ చేసిన విషయం తెల్సిందే. థియేటర్‌ రిలీజ్‌లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌లోనూ అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంది అంటూ అధికారిక సమాచారం అందుతోంది.

రాజ్‌ కుమార్‌ రావు హీరోగా, శ్రద్దా కపూర్‌ హీరోయిన్‌గా రూపొందిన ఈ సినిమాకు అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించిన వసూళ్లకు ప్రతి ఒక్కరు షాక్‌ అయ్యారు. ప్రస్తుతం హర్రర్‌ కామెడీ జోనర్‌ సినిమాలకు మంచి స్పందన వస్తుందని, మరిన్ని సినిమాలు ఇదే జోనర్‌లో తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్త్రీ 2 సినిమా సూపర్‌ హిట్‌ కావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద స్త్రీ 2 సినిమా భారీ వసూళ్లు సాధించడం తనకు చాలా సంతోషాన్ని కలిగించింది అంది. అంతే కాకుండా ముందు ముందు అలాంటి స్త్రీ 2 వంటి ఐటెం సాంగ్స్‌లో నటిస్తాను అంటూ ప్రకటించింది.

జైలర్ సినిమా కావాలయ్యా పాట తర్వాత స్త్రీ 2 లో చేసిన పాటకు మంచి స్పందన వచ్చింది. స్త్రీ 2 సినిమా అంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడంలో తాను చేసిన ఐటెం సాంగ్‌ అత్యంత కీలక పాత్ర పోషించినట్లుగా తమన్నా చెప్పుకొచ్చింది. తన వల్లే ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ ఒక మాటను వదిలేసింది. దాంతో ఇప్పుడు అంతా తమన్నా వల్లే ఆ రూ.800 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. తమన్నా చేసిన వ్యాఖ్యలను చాలా మంది విమర్శిస్తూ ఉంటే, కొందరు ఆమె సన్నిహితులు, ఫ్యాన్స్ మాత్రం స్త్రీ 2 విజయంలో తమన్నా పాత్ర కీలకం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మంచి కథ, తీసిన విధానం, బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌, నటీనటుల నటన ఇలా ప్రతి ఒక్కటి కలిసి సెట్‌ కావడంతో పాటు ఐటెం సాంగ్‌ సరిగ్గా కుదరడం వల్లే భారీ వసూళ్లు నమోదు కావడం జరిగింది. అంతే తప్ప ఒక్క ఐటెం సాంగ్‌తోనే సినిమా అన్ని వందల కోట్ల వసూళ్లు ఎలా నమోదు చేస్తుంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమన్నా ఐటెం సాంగ్‌ చేయడం వల్ల సినిమాలు హిట్‌ అవుతాయి అంటూ ఒక సెంటిమెంట్‌ కొనసాగుతూ వస్తుంది. ఆ సెంటిమెంట్‌ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి.