Begin typing your search above and press return to search.

వీడియో : మిల్కీ బ్యూటీ కష్టం చూడండి

తమన్నా తాజాగా జిమ్‌లో సరదాగా చేసిన ఈ వర్కౌట్‌ వీడియో వైరల్‌ అవుతోంది.

By:  Tupaki Desk   |   28 March 2025 4:57 AM
Tamannaah Gym Funny Video
X

ఒకప్పుడు హీరోయిన్స్ పెద్దగా వర్కౌట్స్ చేసే వారు కాదేమో. ఒకరు ఇద్దరు తప్ప ఎక్కువ శాతం మంది హీరోయిన్స్ ఫిజిక్ పరంగా స్లిమ్‌గా ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా చాలా అందంగా, స్లిమ్‌గా కనిపిస్తున్నారు. అందుకు కారణం ఏంటంటే ప్రతి ఒక్క హీరోయిన్‌ ఫిజికల్‌గా చాలా కష్టపడుతారు, ప్రతి రోజు గంటల తరబడి వర్కౌట్స్ చేస్తారు, తినే ప్రతి దాన్ని లెక్కలోకి తీసుకుని క్యాలరీలు బర్న్ చేసుకునేందుకు వర్కౌట్లు చేస్తారు. అందుకే వయసు పెరిగిన కొద్ది హీరోయిన్స్ చాలా అందంగా, నాజూకుగా కనిపిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా సైతం వర్కౌట్స్ చేస్తూ చాలా కష్టపడుతూ ఉంటుంది.

సుదీర్ఘ కాలం పాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. ఔట్‌ డోర్ షూటింగ్‌లో ఉన్నా సాధ్యం అయినంత వరకు వర్కౌట్లు చేస్తూనే ఉంటుంది. ఆమె ప్రత్యేక ట్రైనర్‌ వద్ద వర్కౌట్స్ చేయడం, ఫిజిక్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చేస్తుందనే విషయం తెల్సిందే. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య ఓదెల 2 సినిమాలో నటించింది. ఆ సినిమా విడుదలకు సిద్ధం అయింది. మరోవైపు ఈమె ఒక హిందీ సినిమాతో పాటు కొన్ని సినిమాల్లోనూ నటించేందుకు రెడీ అవుతుంది. ఈమధ్య కాలంలో తమన్నాకు సినిమాలు లేవంటూ కొందరు కామెంట్‌ చేసినా రెగ్యులర్‌గా బిజీగానే ఉంటుంది.

తమన్నా తాజాగా జిమ్‌లో సరదాగా చేసిన ఈ వర్కౌట్‌ వీడియో వైరల్‌ అవుతోంది. సాదారణంగా చిన్న పిల్లలు హోం వర్క్‌ చేయకుంటే గోడ కుర్చీ వేయిస్తారు. అంటే కాలు ముందుకు పెట్టి కూర్చున్నట్టుగా ఉండాలి. అలా కొన్ని సెకన్లు ఉండటం పర్వాలేదు కానీ ఎక్కువ సమయం ఉండలేము. కానీ తమన్నా చాలా సమయమే ఉంది. కాళ్లు నొప్పి పుడుతున్నా అలాగే తమన్నా ఆ వర్కౌట్‌ చేసింది. కండరాల పటుత్వంకు ఆ ఎక్సర్‌సైజ్ చేస్తారని అంటారు. తమన్నాతో ఆమె ట్రైనర్‌ ఈ వర్కౌట్‌ చేయడం, ఆమె ఈ వీడియోను షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌ అవుతోంది.

తమన్నా ఈ మధ్య కాలంలో ప్రత్యేక పాటలతో తెగ సందడి చేస్తుంది. గ్లామర్ షో చేస్తూ వరుసగా సినిమాలు చేస్తున్న మిల్కీ బ్యూటీకి ఓదెల సినిమాలో సంపత్‌ నంది అవకాశం ఇచ్చాడు. లేడీ అఘోర పాత్రలో తమన్నాను ఓదెల 2 సినిమాలో చూడబోతున్నట్లు ఇప్పటికే తేలిపోయింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయబోతున్నారు. ఏప్రిల్‌ 17న రాబోతున్న ఓదెల 2 సినిమాతో తమన్నా టాలీవుడ్‌లో మళ్లీ బిజీ కావాలని ప్రయత్నిస్తుంది. అది ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి.