పింక్ లెహంగాలో తమన్నా గ్లామర్ మంత్రం
పింక్ చీర, బ్లౌజ్ లో తమన్నా ఆకర్షణీయమైన సొగసుతో యువతరాన్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది.
By: Tupaki Desk | 28 Oct 2024 7:37 AM GMTపింక్ కలర్ లెహంగాలో తమన్నా గ్లామర్ ఫుల్ లుక్ లో కనువిందు చేసింది. ప్రముఖ డిజైనర్లు అబూ జానీ-సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన ఈ కాస్ట్యూమ్ లో ఆమె మరింత మెరుస్తోంది. దీపావళి కానుకగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిక్స్ షేర్ చేసిన తమన్నా, అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన 'ఫుల్ఝాది' అని క్యాప్షన్ తో పేర్కొంది. పింక్ చీర, బ్లౌజ్ లో తమన్నా ఆకర్షణీయమైన సొగసుతో యువతరాన్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది.
తమన్నా కెరీర్ విషయానికొస్తే, ఆమె తన సినీ ప్రస్థానాన్ని 2005లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే బాలీవుడ్ చిత్రంతో ప్రారంభించింది. తెలుగులో ‘శ్రీ’ చిత్రంతో ఆమె టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కానీ ఆమెకు పెద్ద గుర్తింపు వచ్చిన చిత్రం ‘హ్యాపీ డేస్’. అప్పటి నుంచి తమన్నా టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘100% లవ్’, ‘బాహుబలి’, ‘ఎఫ్2’, ‘సైరా’ వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది.
తాజాగా ఈ ఫోటో షూట్ లో తమన్నా తన అప్డేట్లను అభిమానులతో పంచుకుంటూ, తన డిజైనర్ దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణను ప్రదర్శిస్తోంది. ఈ ఫోటోలలో ఆమె తన అందాన్ని మాత్రమే కాకుండా, తనలోని నమ్మకాన్ని కూడా ప్రతిబింబిస్తోంది. సాంప్రదాయ, ఆధునికత మేళవింపుతో అభిమానుల మనసులు దోచుకుంటున్న ఈ లుక్ లో తమన్నా డీప్ పింక్ డ్రెస్సులో యాక్సెసరీస్ తో కలిసి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం తమన్నా పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది. వెబ్ సిరీస్, పాన్ ఇండియా సినిమాల తో పాటు ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా లభించాయి. ఇటీవల తమన్నా స్పెషల్ సాంగ్స్ తో కూడా ఆకట్టుకుంటోంది. స్త్రీ 2లో కూడా ఒక సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓదెలా 2 సినిమాలో అఘోరా పాత్రలో నటిస్తోంది. ఇక ఆమెలేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.