Begin typing your search above and press return to search.

ఈడీ విచారణకు నటి తమన్నా ఎందుకు వెళ్లారు?

రోటీన్ కు భిన్నంగా ఆమె సినిమా వార్తలకు భిన్నంగా తాజాగా ఒక కేసు విషయంలో ఈడీ ఎదుట హాజరైన వైనం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   18 Oct 2024 4:10 AM GMT
ఈడీ విచారణకు నటి తమన్నా ఎందుకు వెళ్లారు?
X

ప్రముఖ నటి తమన్నా భాటియా వార్తల్లోకి వచ్చారు. రోటీన్ కు భిన్నంగా ఆమె సినిమా వార్తలకు భిన్నంగా తాజాగా ఒక కేసు విషయంలో ఈడీ ఎదుట హాజరైన వైనం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఏ కేసులో? ఏ హోదాలో ఆమె విచారణకు హాజరయ్యారు? విచారణ వేళ ఏం జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి. హెచ్ పీజెడ్ టోకెన్ యాప్ కు సంబంధించిన ఒక ప్రకటన చేసినందుకు ఆమెను ఈడీ విచారణకు పిలిచింది. అయితే.. ఆమెపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.

ఇంతకూ ఈ యాప్ దేనికి సంబంధించింది? అన్న విషయంలోకి వెళితే.. బిట్ కాయిన్లు.. ఇతర క్రిప్టో కరెన్సీలను సంపాదించేందుకు వీలుగా సదరు యాప్ ను ప్రమోట్ చేసేందుకు ఆమె నటించారు. ఈ ప్రకటనకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తమన్నా చిక్కుకున్నారు. అయితే.. ఆమెపై ఎలాంటి నేరారోపణ మోపలేదు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమచారం ప్రకారం యాప్ ద్వారా మనీలాండరికంగ్ కు పాల్పడ్డారన్న కేసులో ఇప్పటివరకు 299 సంస్థలను, నిందితులను జాబితాలో చేర్చారు. వీటిలో 76 సంస్థలు చైనా ఆధానంలో నడుస్తున్నాయి. వాటిలో 10 మంది డైరెక్టర్లు చైనా జాతీయులు కాగా.. రెండు సంస్థల్ని విదేశీయులు నడిపిస్తున్నారు.

బిట్ కాయిన్లు.. క్రిప్టో కరెన్సీల మైనింగ్ తో భారీగా లాభాలు గడించొచ్చని ఆశ పెట్టి కోట్లాది రూపాయిలు దండుకున్నారంటూ కోహిమా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వచ్చింది. దీంతో.. ఈ అంశంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. రూ.57 వేల పెట్టుబడికి మూడునెలల పాటు ప్రతి రోజు రూ.4వేలు ఇస్తామని చెప్పి.. కేవలం ఒక్కసారి మాత్రమే ఇచ్చి మానేసినట్లుగా బాధితురాలు పేర్కొన్నారు.

దీంతో ఈ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా సోదాలు చేపట్టిన ఈడీకి ఏకంగా రూ.455 కోట్ల స్థిర.. చరాస్తుల్ని జఫ్తు చేసింది. అసలు డైరెక్టర్లు లేకున్నా.. డొల్ల కంపెనీలను క్రియేట్ చేసి వాటి పేరు మీద బ్యాంక్ ఖాతాలు.. మర్చెంట్ ఐడీలు తీసుకున్నట్లుగా గుర్తించారు. ఈ సంస్థకు చెందిన కార్యక్రమంలో పాల్గొన్న తమన్నాను తాజాగా పిలిచి.. వివరాల్నిసేకరించినట్లుగా చెబుతున్నారు. సదరు యాప్ కు చెందిన ప్రోగ్రాంలో ఆమె పాల్గొనటం.. అందుకోసం రెమ్యునరేషన్ పరంగా కొంత మొత్తాన్ని తీసుకోవటంతో.. ఆ వివరాల్ని సేకరించేందుకు ఆమెను విచారణకు పిలిచినట్లుగా చెబుతున్నారు.