ఐటమ్ నంబర్‌కు కోటి అందుకుంది!
ఇటీవల వరుస చిత్రాల్లో నటిస్తూనే, ప్రత్యేక గీతాల్లోను నర్తిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ చిత్రం `రైడ్ 2`లోని తన తాజా స్పెషల్ డ్యాన్స్ నంబర్ `నషా`తో మరోసారి అభిమానుల హృదయాలను దోచుకుంది.
By: Tupaki Desk | 13 April 2025 7:30 PMసౌత్ బ్యూటీగా పాపులరైన ముంబై గాళ్ తమన్నా భాటియా. టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ హోదా అందుకోవడంతో సౌతిండియన్ అమ్మాయిగానే ప్రపంచం గుర్తిస్తుంది. రెండు దశాబ్ధాల కెరీర్ లో తమన్నా ఎన్నో ఒడిదుడుకులను చవి చూసింది. కెరీర్ లో ఉన్నత స్థానానికి ఎదిగింది.
ఇటీవల వరుస చిత్రాల్లో నటిస్తూనే, ప్రత్యేక గీతాల్లోను నర్తిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ చిత్రం `రైడ్ 2`లోని తన తాజా స్పెషల్ డ్యాన్స్ నంబర్ `నషా`తో మరోసారి అభిమానుల హృదయాలను దోచుకుంది. అజయ్ దేవ్‌గన్ - రితేష్ దేశ్‌ముఖ్ తదితరులు నటించిన ఈ చిత్రం నుంచి తాజా సింగిల్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఈ పాటలో తమన్నా కనిపించడం ఫ్యాన్స్ కి కొత్త ఊపు తెచ్చింది. ఇటీవల మూడు భాషల్లో ప్రత్యేక గీతాల్లో ఆఫర్లు అందుకుంటోంది. తనదైన అద్భుత డ్యాన్స్ ప్రదర్శనలతో తమన్నా వేగంగా పేరు తెచ్చుకుంటోంది.
స్త్రీ 2 లోని `ఆజ్ కి రాత్`లో తమన్నా కిల్లింగ్ మూవ్స్ కుర్రకారు హృదయాలను దోచాయి. మెరిసే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి, తమన్నా తన అద్భుతమైన కదలికలు హావభావాలతో స్క్రీన్ ని మరిగించింది. అభిమానులు తమన్నా ఎనర్జిటిక్ డ్యాన్సులను ప్రశంసించారు.. ఇటీవలి కాలంలో అత్యుత్తమ ఐటెం సాంగ్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు తమన్నా మరో సంచలనాత్మక పాట `నాషా`తో తిరిగి హీట్ పెంచింది. దీనిని ప్రతిభావంతులైన జంట పియూష్-షాజియా కొరియోగ్రఫీ చేశారు. తమన్నా బోల్డ్ గ్లామరస్ లుక్ ని ఎలివేట్ చేస్తూనే, హై-ఎనర్జీ డ్యాన్స్‌లతో హీటెక్కించింది. ప్రస్తుతం ఈ పూర్తి పాట సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది.
పరిశ్రమలో బజ్ ప్రకారం.. తమన్నా భాటియా `నాషా`లో నటించడానికి రూ.1 కోటి వసూలు చేసినట్లు తెలిసింది. ఇంతకుముందు `ఆజ్ కి రాత్` కోసం కోటి వసూలు చేసిందని టాక్ ఉంది. తనదైన అందం, అద్భుత అభినయంతో మెప్పిస్తున్న తమన్నాకు ఈ తరహా అవకాశాలు ఇటీవల ఎక్కువయ్యాయి.