Begin typing your search above and press return to search.

త‌మ‌న్నా 15 ఏళ్ల ప్ర‌యాణంలో భయంక‌ర‌మైన రోజులా!

పాత్ర‌ల‌తో సంబంధం లేకుండా ప‌నిచేసింది. ఐటం భామ‌గానూ స‌త్తా చాటింది. వెబ్ సిరీస్ ల్లో బోల్డ్ గానూ న‌టించి సంచ‌ల‌నం సృష్టించిం ది.

By:  Tupaki Desk   |   29 Dec 2024 3:59 PM GMT
త‌మ‌న్నా 15 ఏళ్ల ప్ర‌యాణంలో భయంక‌ర‌మైన రోజులా!
X

మిల్కీబ్యూటీ త‌మన్నా సినీ ప్ర‌యాణం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ , కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన న‌టి. రెండు భాష‌ల్లోనూ దాదాపు స్టార్ హీరోలంద‌రితోనూ ప‌నిచేసింది. ఇండ‌స్ట్రీలో 15 ఏళ్ల సుదీర్ఘ ప్ర‌యాణం ఆమె సొంతం. న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. పాత్ర‌ల‌తో సంబంధం లేకుండా ప‌నిచేసింది. ఐటం భామ‌గానూ స‌త్తా చాటింది. వెబ్ సిరీస్ ల్లో బోల్డ్ గానూ న‌టించి సంచ‌ల‌నం సృష్టించిం ది.

ఇలా అంది వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశం వినియోగించుకుని మార్కెట్ లో మిల్కీబ్యూటీ అంటే ఓ బ్రాండ్ గా మారింది. సాధార‌ణంగా న‌టికి ఇన్నేళ్ల కెరీర్ అన్న‌ది అంత సుల‌భం కాదు. ఎంతో ప్ర‌తిభ ఉంటే త‌ప్ప సాధ్యం కాదు. ఆ విష‌యంలో త‌మ‌న్నా తాను సైతం అని నిరూపించింది. అయితే ఓ అభిమాని ఆనందం కోసం ఏం చేస్తుంటారు? అని అడ‌గ‌గా త‌న‌లో పెయిన్ బ‌య‌ట పెట్టే ప్ర‌యత్నం చేసింది. 15 ఏళ్ల ప్ర‌యాణ‌మైనా ఇప్ప‌టికీ ఇండ‌స్ట్రీ కొత్త‌గానే ఉంటుందంది.

ఆనందం కోసం ఎప్పుడు వెత‌క‌లేదంది. ఎందుకంటే? ` వృత్తిని మించిన ఆనందం ఇంకేముం టుంది. చేసే పనిలో బోరింగ్ ఉంటుంది. అదే ప‌నిలో భ‌యంక‌ర‌మైన రోజులు కూడా ఉన్నాయంది. అంతే కాదు ఎన్నో అవ‌మానాలు, విమ‌ర్శ‌లు కూడా ఎదుర‌య్యాయి అంది. అలాగ‌ని వాటిని గుర్తు చేసుకుని బాధ‌ప‌డ‌లేదు. వృత్తిలో భాగ‌మ‌ని ముందుకె ళ్లిపోయిన‌ట్లు చెప్పుకొచ్చింది. ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డం త‌ప్ప మ‌రే విష‌యాలు మ‌న‌సులోకి రానివ్వ‌నంది.

అయితే విమ‌ర్శ‌లు..అవ‌మానాల గురించి అమ్మ‌డు వివ‌రించ‌లేదు. సినిమా ఇండ‌స్ట్రీలో ఎదిగే క్ర‌మంలో విమ‌ర్శ‌లు, అవ‌మానాలు స‌హ‌జం. అమితాబ‌చ్చ‌న్, చిరంజీవి లాంటి స్టార్లు కూడా ఎన్నో విమ‌ర్శ‌లు, అవ‌మానాలు ఎదుర్కునే లెజెండ్లుగా మారారు.