విజయ్ వర్మని తమన్నా అందుకే హోల్డ్ లో పెట్టిందా?
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ మొదలు పెట్టిన నాటి నుంచి అమ్మడి తొలి లవ్ అదే అన్నది అందరి అభిప్రాయం.
By: Tupaki Desk | 26 Oct 2024 11:28 AM GMTమిల్కీబ్యూటీ తమన్నా లవ్ లో పడింది ఇదే మొదటి సారి అనుకుంటున్నారంతా? బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ మొదలు పెట్టిన నాటి నుంచి అమ్మడి తొలి లవ్ అదే అన్నది అందరి అభిప్రాయం. ప్రేమించింది ఒక్కడినే..తొలిసారి మనసిచ్చింది ఆ ఒక్కడికే. అతడినే వివాహం చేసుకుంటుందని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ ప్రేమ బంధం పెళ్లి వరకూ వెళ్తుందా? లేదా? అన్నది అప్పుడే చెప్పలేని అంశం.
వివాహం జరిగిన తర్వాత జరిగింది అనుకోవాలి తప్ప అంతకు మించి నిర్ణయించలేదనిది. సెలబ్రిటీల మనసులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. సంగతి పక్కనబెడితే తమన్నా లవ్ లో పడటం..మనసివ్వడం కొత్తేంకాదు. ఆ కార్యం ఇప్పటికి రెండు సార్లు జరిగిందన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది. టీనేజ్ లో ఉన్నప్పుడు ఓ యువకుడిని లవ్ చేసింది. అతడు కూడా ఎంతో ఇష్టపడి ప్రేమించాడు
అప్పటికీ అమ్మడు సినిమాల్లోకి రాలేదంతా . కానీ సినిమాల్లోకి రావాలనే ఆశతో ఉండేదిట. దీంతో అతడితో ప్రేమలో ఉంటే సినిమాల్లోకి రాలేమని భావించి అతడిని తనకు నచ్చిన జీవితం కోసం వదులుకుందిట. ఆ తర్వాత కొంత కాలానికి మరొకరితో లవ్ లో పడిందిట. అతడిని ఎంతగానో ఇష్టపడిందిట. అతడు ఏది అడిగినా కాదనకుండా కొనిచ్చేదట. కానీ ఆ వ్యక్తి తమన్నాతో అబద్దాలు ఎక్కువగా చెప్పేవాడుట.
భరించనంత కాలం భరించి ఇలాంటి అబద్దాల చెప్పే వాడితో జీవితం పంచుకోవడం అనవసరమని అతడికి కటీఫ్ చెప్పిందట. తమన్నా మాటల్నీ బట్టి ఈ రెండు బ్రేకప్ లు తనకు తానుగా చేసుకున్నట్లుగానే కనిపిస్తుంది. ఇక మూడవ వ్యక్తి విజయ్ వర్మ. ప్రస్తుతం అతడితోనే ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకోవడానికి వర్మ రెడీగా ఉన్నా? తమన్నా మాత్రం గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడం లేదు. మరి ఇతడిని కూడా తమన్నా దీర్గ కాలంగా పరిశీలిస్తుందో ఏమో.