ఆ సూపర్ హిట్ ఐటెంపై తమన్నా అసంతృప్తి
మిల్కీ బ్యూటీ తమన్నా గత ఏడాదిలో జైలర్ సినిమాలో ఐటెం సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వా కావాలయ్యా అంటూ సాగిన ఆ పాట ఏడాది అంతా సోషల్ మీడియాలో ఏ స్థాయిలో చక్కర్లు కొట్టిందో తెలిసిందే.
By: Tupaki Desk | 1 Dec 2024 9:30 AM GMTమిల్కీ బ్యూటీ తమన్నా గత ఏడాదిలో జైలర్ సినిమాలో ఐటెం సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వా కావాలయ్యా అంటూ సాగిన ఆ పాట ఏడాది అంతా సోషల్ మీడియాలో ఏ స్థాయిలో చక్కర్లు కొట్టిందో తెలిసిందే. ఆ పాటలో తమన్నా డాన్స్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. రజనీకాంత్ కంటే ఎక్కువగా ఆ పాటలో తమన్నాను ప్రేక్షకులు చూశారు. మిల్కీ బ్యూటీ తమన్నా స్థాయి ఇది అంటూ ఆ డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఆమె ఫ్యాన్స్‌తో పాటు ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేయడం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆ పాట గురించిన ప్రస్థావన సోషల్ మీడియాలో వచ్చింది.
జైలర్ సినిమా కోసం వా కావాలయ్యా పాట చేసిన తర్వాత బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ స్త్రీ 2 లో ఆజ్ కీ రాత్ పాటలోనూ తమన్నా సందడి చేసింది. ఆ సినిమా భారీ విజయం సాధించడంలో తమన్నా కీలక పాత్ర పోషించింది. జైలర్, స్త్రీ 2 లో తమన్నా డాన్స్ సూపర్ అంటూ ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే తమన్నా మాత్రం ఇటీవల ఒక చిట్ చాట్‌లో వా కావాలయ్యా పాటలో తన డాన్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. తాను ఆ పాట కోసం మరింతగా డాన్స్ చేసే అవకాశం ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల తన పూర్తి సామర్థ్యంను చూపించలేక పోయాను అంది.
జైలర్ సినిమాలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది తమన్నా అంటూ ఒక వైపు ప్రచారం జరుగుతూ ఉంటే మరో వైపు ఆమె మాత్రం ఇలా తన ప్రదర్శన పట్ల తానే అసంతృప్తి వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు తమన్నా ఆ సమయంలో తన స్థాయికి తగ్గట్లుగా ఎందుకు చేయలేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో తమన్నా అందాల ఆరబోత ఫోటోలు, వీడియోలు రెగ్యులర్‌గా వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు తమన్నా కావాలయ్యా పాట గురించి చేసిన ప్రకటన పై అంతా చర్చించుకుంటూ ఉన్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు లో ఎంట్రీ ఇచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు అయింది. హ్యాపీ డేస్ తర్వాత ఒక్కసారిగా ఈ అమ్మడి క్రేజ్ మారిపోయింది. అందుకు తగ్గట్లుగానే ఈ అమ్మడి సినిమాలు చేస్తూ వచ్చింది. టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోల నుంచి యంగ్ స్టార్ హీరోల వరకు ఎందరితోనో సినిమాలు చేసిన ఈ అమ్మడు బాలీవుడ్, తమిళ్ సినిమాల్లోనూ నటించింది. కన్నడంతో పాటు మలయాళ సినిమాల ఇండస్ట్రీలో ఈమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌లో, మ్యూజిక్ వీడియోస్‌లోనూ తమన్నా నటించి మెప్పించింది.