షాకిచ్చిన తమన్నా బ్రేకప్ సందేశం
స్టార్ హీరోయిన్ తమన్నా - విజయ్ వర్మ జంట ప్రేమ వివాహానికి సిద్ధమవుతోందని కొన్ని నెలలుగా ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 17 March 2025 8:13 PM ISTస్టార్ హీరోయిన్ తమన్నా - విజయ్ వర్మ జంట ప్రేమ వివాహానికి సిద్ధమవుతోందని కొన్ని నెలలుగా ప్రచారం సాగుతోంది. కానీ ఇంతలోనే ఈ జంట విడిపోవడం షాకిచ్చింది. కెరీర్ కోసం ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారని కథనాలు రావడం ఆశ్చర్యపరిచింది. ఇటీవల వరుస ఈవెంట్లలో ఆ ఇద్దరూ విడివిడిగా కనిపించారు. హోలీ సందర్భంగా ఓ ప్రముఖుడి ఇంట పార్టీకి ఎటెండ్ అయినా కానీ, ఇద్దరూ విడివిడిగా దూరంగా కనిపించారు. ఇప్పుడు బ్రేకప్ వార్తల నడుమ తమన్నా తాజా పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్‌లో అద్భుతాలు జరుగుతాయని ఎదురు చూడకూడదని తమన్నా వ్యాఖ్యానించింది.
``అద్భుతం జరిగే వరకు వేచి ఉండకండి - అద్భుతాన్ని సృష్టించండి`` అని ఒక స్ఫూర్తివంతమైన కోట్‌ను ఇన్ స్టాలో రాసింది. తమన్నా- విజయ్ విడిపోయారనే ఊహాగానాల నడుమ ఈ కోట్ ఆలోచింపజేస్తోంది. ఇప్పటివరకూ తాము విడిపోయామని ఆ ఇద్దరిలో ఎవరూ ధృవీకరించలేదు.
అసలింతకీ ఆ ఇద్దరి మధ్యా ఏం జరిగింది? అంటే... తమన్నా 33 వయసు లో ఇక పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలవ్వాలని కోరుకున్నారు. కానీ దానికి విజయ్ వర్మ ఒప్పుకోలేదు. అతడు ఇంకా కెరీర్ ని బిల్డ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ ఇద్దరూ స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు కథనాలొచ్చాయి.
ఒక ఎమోషనల్ ఘట్టంలో విజయ్ నిర్ణయంతో తమన్నా అసహనానికి గురైందని ఇది వివాదానికి దారి తీసిందని కూడా ప్రముఖ మీడియాల్లో కథనాలొచ్చాయి. అయితే ఇందులో నిజం ఎంత అన్నది ఆ ఇద్దరిలో ఎవరూ ధృవీకరించలేదు.
తమన్నా - విజయ్ వర్మ 2022లో డేటింగ్ ప్రారంభించారు. 2023లో స్ట్రీమ్ అయిన నెట్‌ఫ్లిక్స్ `లస్ట్ స్టోరీస్ 2`లో కలిసి నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్యా ప్రేమ మొదలైంది. తర్వాత వారు దానిని బహిర్గతం చేసారు. ఏడాదిలోనే విడిపోవడం ఇప్పుడు అందరికీ షాకిస్తోంది.