Begin typing your search above and press return to search.

హోలీ వేడుక‌ల్లో త‌మ‌న్నా, విజ‌య్.. బ్రేక‌ప్ నిజ‌మా కాదా?

హీరోయిన్ త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ రిలేష‌న్‌షిప్ లో ఉన్న విష‌యం అంద‌రికీ తెలుసు.

By:  Tupaki Desk   |   14 March 2025 4:48 PM IST
హోలీ వేడుక‌ల్లో త‌మ‌న్నా, విజ‌య్.. బ్రేక‌ప్ నిజ‌మా కాదా?
X

హీరోయిన్ త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ రిలేష‌న్‌షిప్ లో ఉన్న విష‌యం అంద‌రికీ తెలుసు. రెండేళ్ల‌కు పైగా డేటింగ్ లో ఉన్న ఈ జంట తాజాగా విడిపోతున్నార‌ని బాలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రూ క‌లిసి ప‌లు పార్టీల‌కు, వెకేష‌న్‌ల‌కు వెళ్లారు. ఎక్క‌డికెళ్లినా చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన విజ‌య్, త‌మ‌న్నా ఈ మ‌ధ్య మాత్రం విడివిడిగానే క‌నిపిస్తున్నారు.

త‌మ‌న్నా- విజ‌య్ బ్రేక‌ప్ న్యూస్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన నేప‌థ్యంలో వీరిద్ద‌రూ హోలీ వేడుక‌ల్లో పాల్గొన్నారు. బాలీవుడ్ న‌టి ర‌వీనా టండ‌న్ ఏర్పాటు చేసిన హోలీ సెల‌బ్రేష‌న్స్ కు త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ హాజ‌ర‌య్యారు. రిలేష‌న్‌లో ఉన్న‌ప్పుడు ఎక్క‌డికెళ్లినా జంట‌గా వెళ్లే వీరు ఇప్పుడు మాత్రం విడివిడిగా రవీనా ఇంటికి వ‌చ్చారు.

ల‌స్ట్ స్టోరీస్2 వెబ్ సిరీస్ షూటింగ్ టైమ్ లో వీరి మ‌ధ్య స్నేహం ఏర్ప‌డి, త‌ర్వాత అది ప్రేమ‌గా మారింది. ఈ సిరీస్ ప్ర‌మోష‌న్స్ లోనే త‌మ‌న్నా, విజ‌య్ త‌మ రిలేష‌న్‌షిప్ ను అనౌన్స్ చేశారు. ఈ సిరీస్ లో త‌మన్నా, విజ‌య్ మ‌ధ్య ఇంటిమేట్ సీన్స్ కూడా ఉన్నాయి. వారిద్ద‌రూ ల‌వ్ లో ఉన్నారు కాబ‌ట్టే ఆ సీన్స్ అంత బాగా పండాయని కూడా అప్ప‌ట్లో ఫ్యాన్స్ కామెంట్ చేశారు.

పెళ్లి, కెరీర్ విష‌యంలో వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం వ‌ల్లే త‌మ‌న్నా, విజ‌య్ విడిపోయార‌ని బాలీవుడ్ లో ప్రచారం జ‌రుగుతుంది. పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ కావాల‌ని త‌మ‌న్నా అనుకుంటుంటే, విజ‌య్ మాత్రం పెళ్లి చేసుకోవ‌డానికి తాను రెడీగా లేన‌ని, ఇంకాస్త టైమ్ కావాల‌ని అన్నాడ‌ట‌. దీంతో వీరిద్ద‌రూ బ్రేక‌ప్ చెప్పుకుని, ఫ్రెండ్స్ గా మాత్ర‌మే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముంద‌నేది తెలియ‌దు. అయితే వీరి బ్రేక‌ప్ గురించి అటు త‌మ‌న్నా కానీ, ఇటు విజ‌య్ కానీ ఎక్క‌డా మాట్లాడింది లేదు.

తెలుగులో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించిన త‌మ‌న్నా ఈ మ‌ధ్య త‌న పూర్తి ఫోక‌స్ ను బాలీవుడ్ పైనే పెట్టింది. అప్పుడ‌ప్పుడు సౌత్ లో సినిమాలు చేస్తూ, స్పెష‌ల్ సాంగ్స్ లో మెరుస్తున్న త‌మ‌న్నా, బాలీవుడ్ లోనే సెటిల‌వ్వాల‌ని చూస్తోంది. ఇక విజ‌య్ వ‌ర్మ విష‌యానికొస్తే బాలీవుడ్ తో పాటూ సౌత్ లో కూడా ఎన్నో సినిమాల్లో ప‌లు కీల‌క పాత్ర‌లు చేశాడు.