Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందే అపార్ట్‌మెంట్.. త‌మ‌న్నా సీరియ‌స్‌గా..!

టాలీవుడ్‌లో రెండు ద‌శాబ్ధాల సుదీర్ఘ ఇన్నింగ్స్ తో అగ్ర క‌థానాయికగా ఎదిగింది త‌మ‌న్నా. హిందీ త‌మిళ భాష‌ల్లోను త‌మ‌న్నా హిట్ చిత్రాల్లో న‌టించింది.

By:  Tupaki Desk   |   21 Nov 2024 5:30 PM GMT
పెళ్లికి ముందే అపార్ట్‌మెంట్.. త‌మ‌న్నా సీరియ‌స్‌గా..!
X

టాలీవుడ్‌లో రెండు ద‌శాబ్ధాల సుదీర్ఘ ఇన్నింగ్స్ తో అగ్ర క‌థానాయికగా ఎదిగింది త‌మ‌న్నా. హిందీ త‌మిళ భాష‌ల్లోను త‌మ‌న్నా హిట్ చిత్రాల్లో న‌టించింది. ముఖ్యంగా బాహుబ‌లి- జైల‌ర్ లాంటి సినిమాల‌తో త‌మ‌న్నా ప్ర‌తిభ‌ గురించి చాలా చ‌ర్చ సాగింది. ఇటీవ‌ల కావాలా (జైల‌ర్) పాట‌తో మ‌రింత‌గా పాపులారిటీ పెరిగింది.

మొన్న‌టికి మొన్న `స్త్రీ 2` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌తో హిందీ చిత్రసీమలో సాలిడ్‌గా పునరాగమనం చేసింది మిల్కీ బ్యూటీ. ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ హిందీ చిత్రాల‌కు సంత‌కాలు చేస్తోంది. మ‌రోవైపు సౌత్ లో కెరీర్ ని బ్యాలెన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికి మించి తమన్నా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాన‌ని అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ జంట డేటింగ్ కి సంబంధించి ప్ర‌తిదీ అధికారిక‌మే.

అయితే పెళ్లెప్పుడు? అన్న ప్ర‌శ్న‌కు ఇంత‌కాలం స‌మాధానం లేదు. కానీ ఇప్పుడు తమన్నా - విజయ్ 2025లో పెళ్లి చేసుకోబోతున్నారని హిందీ ఫిల్మ్ సర్కిల్స్‌లో గుస‌గుస వినిపిస్తోంది. ఈ జంట తమ పెళ్లి తర్వాత కొత్త జీవితం ప్రారంభించేందుకు ముంబైలో ఒక‌ ఖరీదైన అపార్ట్‌మెంట్ కోసం వెతుకుతున్నట్లు క‌థ‌నాలొస్తున్నాయి.

ఈ వార్తలను ఈ జంట అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది. చాలామంది బాలీవుడ్ జంట‌లు పెళ్లి త‌ర్వాత నివ‌శించేందుకు బాంద్రాలో సీఫేసింగ్ అపార్ట్ మెంట్లు కొనుక్కున్నారు. అదే మార్గంలో ఈ జంట కూడా పయ‌నిస్తోంద‌న్న గుస‌గుస న‌డుమ‌.. ఆ ఒక్క‌ పెద్ద అడుగు ఎప్పుడు వేస్తారో వేచి చూడాలి.