పిక్‌టాక్ : ప్రియుడితో పార్టీలో మిల్కీ బ్యూటీ
ఆ సినిమాలో కేవలం ఒక పాటలోనే కనిపించిన ఉర్రూతలూగించింది.
By: Tupaki Desk | 17 Dec 2024 1:55 PM GMTసినిమా ఇండస్ట్రీలో దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చిన తమన్నా హ్యాపీడేస్ సినిమా తర్వాత పదేళ్లు వెనక్కి తిరిగి చూసుకోకుండా టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్‌గా సినిమాలు చేసింది. యంగ్ స్టార్ హీరోలు దాదాపు అందరితోనూ నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా చిరంజీవి వంటి సీనియర్ స్టార్ హీరోతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ అమ్మడు తాజాగా రజనీకాంత్ తో జైలర్ సినిమాలో కనిపించింది. ఆ సినిమాలో కేవలం ఒక పాటలోనే కనిపించిన ఉర్రూతలూగించింది. ఆ తర్వాత స్త్రీ 2 సినిమాలోనూ ఈ అమ్మడు నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
మిల్కీ బ్యూటీ తమన్నా చాలా కాలంగా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. ఆ విషయాన్ని తమన్నా ఇప్పటికే దృవీకరించింది. వీరి పెళ్లి కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ పెళ్లి విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా వీరి రిలేషన్ కొనసాగుతోంది. ఇద్దరు కలిసి నటిస్తున్నారు, ఇద్దరూ కలిసి పార్టీలకు వెళ్తున్నారు. ఇద్దరూ కెరీర్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఒకరికి ఒకరు అన్నట్లుగా కెరీర్‌లో ముందుకు వెళ్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో తమన్నాకి ఆఫర్లు పెద్దగా రావడం లేదు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు పెద్దగా ఏమీ లేవు.
వచ్చే ఏడాదిలోనూ ఈమె నుంచి వచ్చే సినిమాలు లేవు. బాలీవుడ్‌లో అడపా దడపా సినిమా ఛాన్స్‌లు వస్తున్నాయి. మ్యూజిక్ వీడియోలతో పాటు ప్రత్యేక పాటల్లో నటిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు వెబ్ సిరీస్‌లతో మరింత బిజీ అవ్వాలని భావిస్తుంది. ఇప్పటికే ఈమె చేసిన వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను పెద్దగా అలరించలేక పోయాయి. అయినా ముందు ముందు తన నుంచి వెబ్ సిరీస్‌లు వస్తాయి అంటూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తాజాగా ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఒక పార్టీలో పాల్గొన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా అందాల ఆరబోత ఫోటోలతో వైరల్ అయ్యే తమన్నా ఈసారి ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలతో వైరల్ అయ్యింది. సినీ ప్రముఖులు ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్న ఆ పార్టీలో ప్రియుడు విజయ్ వర్మతో కలిసి తమన్నా పాల్గొనడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పార్టీలో విక్రాంత్ మాస్సే, శీతల్ ఠాకూర్, ప్రగ్యా కపూర్, జితేంద్ర, సోనాలి బింద్రేలు ఈ పార్టీలో పాల్గొన్నారు. ప్రగ్యా కపూర్ ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.