ఆ విషయంలోనూ తమన్నా తగ్గేదేలే!
మిల్కీబ్యూటీ తమన్నా సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 July 2024 1:30 AM GMTమిల్కీబ్యూటీ తమన్నా సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ అవకాశాలతో పాటు, వచ్చిన ఏ చిన్న ఛాన్స్ కూడా వదులుకోవడం లేదు. అవసరం మేర గెస్ట్ అప్పి రియన్స్ ఇస్తుంది. ఐటం పాటల్లో సత్తా చాటుతుంది. భాషతో సంబంధం లేకుండా ఎక్కడ ఛాన్స్ ఉంటే? అక్కడ తమన్నా ఉంటుందని నిరూపిస్తుంది. మరోవైపు ఫిట్ నెస్ విషయంలోనే అమ్మడు అంతే కేరింగ్ తీసుకుంటుంది.
నిత్యం వర్కౌట్లు, యోగా లాంటివి క్రమం తప్పకుండా చేస్తుంది. మిల్కీలో ఆమెరుపుకు అసలు కారణం అదేనన్న సంగతి తెలిసిందే. అలాగే అమ్మడు మంచి ఫుడీ అని కూడా తాజాగా రివీల్ చేసింది. గుల్బర్ బ్లాగ్స్ అనే ఇన్ స్టా పేజీని నెటి జనులతో పంచుకుంది. ఇందులో ఫుడ్ ఐటమ్ లు వెంట వెంటనే ఛేంజ్ అవుతుంటాయి. మోముస్, ఐస్ క్రీమ్స్, బర్గర్స్, చాక్లెట్స్, హాట డాగ్ ఇలా అన్నిరకాల పదార్దాలు ఉంటాయి.
మీ మైండ్ లో ఏం రన్ అవుతుందని ఎవరైనా అడిగితే? నేను ఇదే చెబుతానని పుడ్ పై తనకున్న ఆసక్తిని చెప్పకనే చెప్పింది. ఇది పూర్తిగా నిజమని కచ్చితంగా చెప్పింది. అలాగే పుడ్ విషయంలో ఏ మాత్రం రాజీపడనంది. ఫిట్ నెస్ కోసం ఇష్టమైన ఆహారం వదులుకోను. కడుపునిండా లాంగిచేస్తా. కానీ అందుకు తగ్గట్టు వ్యాయామం చేస్తా. క్యాలరీలు కరిగిస్తా. శాఖాహారం ఎక్కువగా తీసుకుంటానని, ఎక్కువగా మంచి నీళ్తు తాగుతానని తెలిపింది.
ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే ఇటీవలే `బాక్` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా తమిళ్ లో బాగానే ఆడింది. ఇందులో అమ్మడు ఇద్దరు పిల్లల తల్లిగా నటించింది. ఇంతవరకూ మామ్ పాత్రను తమన్నా పోషించలేదు. తొలిసారి ఆతరహా పాత్రలోనూ కనిపించి ముచ్చట తీర్చుకుంది. ప్రస్తుతం వేద, స్త్రీ-2, ఒదెల రైల్వేస్టేషన్-2 చిత్రాల్లో నటిస్తోంది. ఇవిగాక కొత్త ప్రాజెక్ట్ లు క్యూలో పెట్టింది.