వధువు తమన్నా సుగుణసుందరి అవతారం
అవును.. ఇది సడెన్ ట్విస్ట్.. ఊహించని ట్విస్ట్.. వరుసగా కథానాయికలు వధువులుగా మారుతున్నారు. నచ్చినవాడిని పెళ్లాడేస్తున్నారు.
By: Tupaki Desk | 27 March 2024 5:20 AM GMTఅవును.. ఇది సడెన్ ట్విస్ట్.. ఊహించని ట్విస్ట్.. వరుసగా కథానాయికలు వధువులుగా మారుతున్నారు. నచ్చినవాడిని పెళ్లాడేస్తున్నారు. కానీ చాలా కాలంగా తమన్నా పెళ్లి గురించి అడిగితే దాటవేస్తోంది. ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. తన ప్రియుడు విజయ్ వర్మతో డేట్ గురించి మాత్రమే మాట్లాడుతోంది కానీ, పెళ్లి గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చూస్తుంటే ఇక తమన్నాకు కూడా లగ్గం పెట్టే సమయం ఆసన్నమైందని నెటిజనుల్లో గుసగుస ఆగడం లేదు.
అయితే ఇంతలోనే ఒక సడెన్ ట్విస్ట్. తమన్నా వధువుగా మారింది. బ్రైడల్ దుస్తుల్లో ఫోటోషూట్ లో పాల్గొంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో దుమారం రేపుతున్నాయి. అయితే తమన్నా నిజంగానే పెళ్లికూతురు అవుతోందా? అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమన్నా పెళ్లికూతురు అయిన మాట నిజమే కానీ, ఇది కేవలం డిజైనర్ షో కోసం మాత్రమే. ఇది కేవలం ఒక అందమైన డిజైనర్ ఫోటోషూట్. ప్రఖ్యాత డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన బ్రైడల్ డిజైనర్ దుస్తుల్లో తమన్నా ముగ్ధ మనోహర రూపం కట్టి పడేస్తోంది.
రకరకాల డిజైనర్ దుస్తుల్లో తమన్నా వధువు అవతార్ మతులు చెడగొడుతోంది. ఇందులో ఒక ఫోటోగ్రాఫ్ లో తమన్నా మత్స్యకన్య అవతారంలోను కనిపించింది. ఈ లుక్ నిజంగా స్టన్నింగ్. నేలమీదికి జాలువారుతూ పొడవాటి డిజైనర్ లెహంగాలో తమన్నా విరహాన్ని ప్రదర్శిస్తున్న మరో ఫోటోగ్రాఫ్ కూడా వేడి పెంచుతోంది. వీటికి భిన్నంగా బుట్ట బొమ్మ అవతారంలో భారీతనం నిండిన డిజైనర్ ఫ్లోరల్ టాప్ లోను తమన్నా ఎంతో అందంగా కనిపించింది. ఈ ఫోటోషూట్ లో తమన్నా బెస్ట్ గెటప్స్ యూత్ ని ఆకర్షిస్తున్నాయి. మరోవైపు తమన్నా కెరీర్ పరంగా సెలక్టివ్ గా ముందుకు సాగుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే తమన్నా ఓదెలా 2లో నటిస్తోంది. ఇటీవల మహా శివరాత్రి 2024 నాడు తమన్నా నటిస్తున్న చిత్రం `ఓదెలా 2` ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. హర్ హర్ మహాదేవ్! హ్యాపీ మహా శివరాత్రి అంటూ పోస్టర్ కి క్యాప్షన్ ని కూడా ఇచ్చింది తమన్నా. పోస్టర్‌లో తమన్నా సాధువు అవతారంలో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఒక చేతిలో పవిత్రమైన శంఖం .. మరో చేతిలో డ్రమ్‌ని పట్టుకుని వింతగా కనిపించింది.