సౌత్ ఇండస్ట్రీలో విషపూరితమైన మేల్ డామినేషన్?
ప్రముఖ జాతీయ మీడియాకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ దక్షిణాదిలో కొన్ని సూత్రాలు ఫిక్స్ డ్ గా ఉపయోగిస్తానని, ఎందుకంటే అవి తేలికైనవి అని తెలిపింది.
By: Tupaki Desk | 29 Sep 2023 4:47 AM GMTదక్షిణాది నాలుగు పరిశ్రమలు సహా హిందీ చిత్రసీమలోను తమన్నా నటించింది. తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో ఎక్కువగా నటించింది. చిరంజీవి, రజనీకాంత్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ లాంటి అగ్ర హీరోల సరసన నటించింది. మరోవైపు యువహీరోల సరసనా ఈ అమ్మడు కెరీర్ ని బ్యాలెన్స్ చేసిందని చెప్పాలి. అయితే సౌత్ ఫిలింఇండస్ట్రీలో విషపూరితమైన మేల్ డామినేషన్ ని ఎదుర్కోవాల్సి వచ్చిందా? అని ప్రశ్నిస్తే దానికి తమన్నా ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
ప్రముఖ జాతీయ మీడియాకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ దక్షిణాదిలో కొన్ని సూత్రాలు ఫిక్స్ డ్ గా ఉపయోగిస్తానని, ఎందుకంటే అవి తేలికైనవి అని తెలిపింది. "కొన్ని కమర్షియల్ చిత్రాలలో నేను నా పాత్రలతో కనెక్ట్ కాలేను. అలాంటి సమయంలో దర్శకనిర్మాతలను మేల్ డామినేషన్ తీవ్రతను తగ్గించమని అభ్యర్థించాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పార్ట్ లు చేయడం మానేసి వచ్చేశాను. విషపూరితమైన పురుషాధిక్యతని దాదాపు తట్టుకోలేనంతగా తీసే సినిమాల్లో భాగం కాకూడదని నేను చేతనైన ప్రయత్నం చేశాను" అని తెలిపింది.
దక్షిణాదిలో లాగా బాలీవుడ్‌లో విజయం సాధించకపోవడంపైనా తమన్నా మాట్లాడింది. నేను ఇక్కడ (బాలీవుడ్) చేసిన సినిమాలు వర్కవుట్ కాలేదు. ఎందుకంటే ఇది వారి విధి. చాలా మంది వ్యక్తులతో సినిమాలు తీసారు. అందువల్ల నేను దానిని వ్యక్తిగత వైఫల్యంగా ఎప్పుడూ తీసుకోలేదు. ఆ విధంగా నేను నా విజయాలు అపజయాలు రెండింటి నుండి కొంచెం వేరుగా ఉన్నాను. నేను వేటినీ సీరియస్ గా తీసుకోను. నేను బ్రతికే ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నాను. నేను దానిని ఎలా చూస్తున్నాను అనేదే ముఖ్యం. 17 సంవత్సరాల తర్వాత నేను ఇప్పటికీ ప్రతిరోజూ మేల్కొనే ఉంటాను. మళ్లీ మళ్లీ నటిగా ఏదైనా ప్రత్యేకంగా చేయాలని కోరుకుంటున్నాను. నటన నా ప్యాషన్. నేను కెమెరాను ఎదుర్కోవడానికి మేల్కొంటాను. ఇది నన్ను చాలా ఉత్తేజపరుస్తుంది" అని అంది.
తమన్నా భాటియా ఇటీవల 'ఆక్రి సచ్' అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. నిర్వికర్ ఫిలిమ్స్ నిర్మించారు. ఈ సిరీస్‌లో అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, డానిష్ ఇక్బాల్, నిషు దీక్షిత్, కృతి విజ్, సంజీవ్ చోప్రా తదితరులు నటించారు. తమన్నా భాటియా తదుపరి చిత్రం 'వేదా'లోను కనిపించనుంది. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం, శర్వరి వాఘ్, అభిషేక్ బెనర్జీ కూడా నటించారు. 2024లో ఈ సినిమా విడుదల కానుంది.