Begin typing your search above and press return to search.

మ‌రో దెయ్యం సినిమాలో మిల్కీ మెరుపులు!

న‌టిగా ఎంత స‌క్సెస్ అయిందో? ఐటం భామ‌గా అంత‌కు మించి ఫేమ‌స్ అయింది.

By:  Tupaki Desk   |   6 July 2024 12:12 PM GMT
మ‌రో దెయ్యం సినిమాలో మిల్కీ మెరుపులు!
X

మిల్కీబ్యూటీ త‌మన్నా ప‌నైపోయింద‌న్న‌ప్పుడ‌ల్లా ఊహించ‌ని విధంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఎలాగైనా సరే ఇండ‌స్ట్రీలో ఉండాలి అనే నినాదంతో ఉన్న అమ్మ‌డు న‌టిగా అవ‌కాశాలు రాక‌పోతో ఐటం భామ‌గా వెళ్లిపోతుంది. ఈ లోపు న‌టిగా అవకాశాలు సృష్టించుకుంటుంది. కొంత కాలంగా అమ్మ‌డు జ‌ర్నీ అలాగే ముందుకు సాగుతుంది. న‌టిగా ఎంత స‌క్సెస్ అయిందో? ఐటం భామ‌గా అంత‌కు మించి ఫేమ‌స్ అయింది.

ఐటం భామ‌గా ఏ భాష‌లో ఛాన్స్ వ‌చ్చినా నో చెప్ప‌కుండా చేస్తుంది. తాజాగా బాలీవుడ్ హార‌ర్ చిత్రం 'స్త్రీ-2' లో కూడా త‌మ‌న్నా ఐటం పాట‌కి లాక్ అయిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఆ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయింది. టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. దెయ్యం భ‌యంతో జ‌నం అరుపులు.. దెయ్యం పాత్ర‌లో శ్ర‌ద్దా క‌పూర్ ఆహార్యం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్..దెయ్యం అరుపులు ప్ర‌తీది ఇంటెన్స్ ని తీసుకొస్తున్నాయి.

దెయ్యం కోసం రాత్రిపూట మాటు వేయ‌డం...గోడ‌ల‌పై దెయ్యం సంకేతాలు లాంటివి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మధ్య‌లో మిల్కీబ్యూటీ ఐటం మెరుపు రిలాక్స్ ని ఇస్తుంది. తమన్నా స్టార్ పవర్‌ని హర్రర్ చిత్రానికి అందించడం ఇదే మొదటిసారి కాదు. ఏడాది ఆరంభంలో తమిళ చిత్రం 'అరణ్మై 4స 'అచచ్చో' పాట‌తో అద‌ర‌గొట్టింది. సిజ్లింగ్ ఐటెమ్ నంబర్ ఓ రేంజ్ లో ఫేమ‌స్ అయింది. రాశి ఖన్నాతో పాటు తమన్నా మెరుపులు సినిమాకి హైలైట్ గా నిలిచాయి.

'స్త్రీ 2'లో తమన్నా ఐటెం సాంగ్ కుర్రాళ్ల‌లో ఊపు తేవ‌డం ఖాయం. త‌మ‌న్నా ఎంట్రీకి సినిమాకి మంచి హైప్ తీసుకొస్తుంది. త‌మ‌న్నాకి సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక్క‌డ కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసే ప్లాన్ లో భాగంగా త‌మ‌న్నాకి ఛాన్స్ ఇచ్చారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన `స్త్రీ 2`లో రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా , అభిషేక్ బెనర్జీ వరుణ్ ధావన్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.