Begin typing your search above and press return to search.

18ల‌క్ష‌లు అద్దె వ‌సూల్.. త‌మ‌న్నా ఆస్తుల విలువ‌?

ముంబై జుహు ప్రాంతంలోని క‌మ‌ర్షియ‌ల్ ప్రాప‌ర్టీ ఇద‌ని ప్రాప్‌స్టాక్ షో ద్వారా యాక్సెస్ అయిన పత్రాలు ఈ వివ‌రాల్ని వెల్ల‌డిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   2 July 2024 1:47 PM GMT
18ల‌క్ష‌లు అద్దె వ‌సూల్.. త‌మ‌న్నా ఆస్తుల విలువ‌?
X

ఒక్కో సినిమాకి 3-4కోట్ల పారితోషికం...ఐట‌మ్ నంబ‌ర్ కి 80ల‌క్ష‌లు.. ప్ర‌క‌ట‌న‌లు, సోష‌ల్ మీడియా ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ల‌క్ష‌ల్లో ఆదాయం.. ఈ మొత్తం ఆదాయానికి క‌మ‌ర్సియ‌ల్ కాంప్లెక్సుల అద్దెల రూపంలో అద‌నపు ఆర్జ‌న‌.. వెర‌సి ఇప్ప‌టికే రెండు ద‌శాబ్ధాలుగా ప‌రిశ్ర‌మ‌లో ఉన్న త‌మ‌న్నా భాటియా సుమారు 120 కోట్ల ఆస్తులు కూడ‌బెట్టింద‌నేది ఇండ‌స్ట్రీ టాక్.

త‌మ‌న్నా నెల‌వారీ ఆదాయం భేషుగ్గా ఉంది.. తాజా స‌మాచారం మేర‌కు ముంబై ఆస్తి(ఇంటి)పై నెల‌కు 18ల‌క్ష‌లు ఆదాయం అందుకుంటోంది. అద్దె రూపంలో ఇది వ‌స్తోంది. ముంబై జుహు ప్రాంతంలోని క‌మ‌ర్షియ‌ల్ ప్రాప‌ర్టీ ఇద‌ని ప్రాప్‌స్టాక్ షో ద్వారా యాక్సెస్ అయిన పత్రాలు ఈ వివ‌రాల్ని వెల్ల‌డిస్తున్నాయి.

జుహు తారా రోడ్‌లోని వెస్ట్రన్ విండ్ బిల్డింగ్‌లో 6065 చదరపు అడుగుల ఆస్తిని త‌మ‌న్నా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్ లో రెంట్ల‌కు ఇచ్చారు. ఈ దస్తావేజు జూన్ 27 న రిజిస్టర్ అయింది. నెలవారీ అద్దె నాలుగో సంవత్సరం నుండి రూ. 20.16 లక్షలకు .. ఐదో సంవ‌త్స‌రం రూ. 20.96 లక్షలకు పెంచేందుకు వీలుగా పత్రాలు రాసుకున్నారు. నానావతి కన్‌స్ట్రక్షన్ వారు త‌మ‌న్నాకు రూ. 72 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు. రిజిస్ట్రేషన్ సమయంలో త‌మ‌న్నా రూ.2.9 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించింది.

మరో లావాదేవీలో త‌మ‌న్నా భాటియా ముంబైలోని మూడు ఆస్తులను రూ.7.84 కోట్లకు తనఖా పెట్టినట్లు ప్రాప్‌స్టాక్ యాక్సెస్ చేసిన పత్రాలు చూపిస్తున్నాయి. మొత్తం 2595 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తులు అంధేరీ వెస్ట్‌లోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉన్నాయి. రుణదాత ఇండియన్ బ్యాంక్ .. తనఖా తేదీ మే 30. లావాదేవీకి సంబంధించిన స్టాంప్ డ్యూటీ రూ. 4.7 లక్షలు చెల్లించారు.

బాలీవుడ్ న‌టీనటులు ముంబైలో లగ్జరీ రియల్ ఎస్టేట్ లో పెట్టుబ‌డుల‌ కోసం వెంపర్లాడుతున్నారు. ఇటీవల లగ్జరీ రియల్ ఎస్టేట్ విభాగంలో చాలా మంది స్టార్లు భారీగా ఆస్తులు కొన్నారు. జూన్ 25న నటుడు అమీర్ ఖాన్ ముంబైలోని పాలి హిల్‌లోని అపార్ట్‌మెంట్‌ను రూ.9.75 కోట్లకు కొనుగోలు చేశారు. జూన్ 20న అమితాబ్ బచ్చన్ ముంబైలోని వీర్ సావర్కర్ సిగ్నేచర్ బిల్డింగ్‌లో దాదాపు రూ.60 కోట్లతో మూడు కార్యాలయ యూనిట్లను కొనుగోలు చేశారు. ఈ కార్యాలయ స్థలాలు ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలోని వీర దేశాయ్ రోడ్‌లోని సిగ్నేచర్ బిల్డింగ్‌లో ఉన్నాయి. జూన్ 3న, యానిమల్, బుల్బుల్, ఖలా వంటి చిత్రాలలో పాత్రలతో పాపుల‌రైన‌ ట్రిప్తీ డిమ్రీ ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో రూ. 14 కోట్లకు విలాసవంతమైన ఆస్తిని కొనుగోలు చేసింది. అభిషేక్ బ‌చ్చ‌న్, అర్జున్ క‌పూర్, బోనీక‌పూర్, జాన్వీ క‌పూర్- ఖుషీ క‌పూర్ స‌హా ప‌లువురు భారీగా రియ‌ల్ వెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులు పెట్టార‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి.