బాలయ్య కోసం ఎన్టీఆర్ స్వింగ్‌జర...!
అంతటి సక్సెస్ అయిన స్వింగ్ జర పాట బ్యూటీని ఇప్పుడు తాను రూపొందిస్తున్న బాలయ్య సినిమా కోసం తీసుకు వచ్చేందుకు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 18 Dec 2023 5:45 AM GMTనందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీర సింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలతో ప్రేక్షకు ముందుకు వచ్చి విజయాలు నమోదు చేసి హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఫేం బాబీ దర్శకత్వంలో బాలయ్య మూవీ రూపొందుతోంది. కచ్చితంగా ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి విందు భోజనం అంటున్నారు.
దర్శకుడు బాబీ తన ప్రతి సినిమాలో కూడా మాస్ ప్రేక్షకుల కోసం ఓ రేంజ్ లో మస్ మసాలా ట్రీట్ ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అంటే ఏ రేంజ్ లో సందడి చేశాడో మనకు తెల్సిందే. ఇప్పుడు బాలయ్య సినిమా కోసం కూడా అదే రేంజ్ లో ఓ మసాలా ఐటం ని రెడీ చేస్తున్నాడు.
గతంలో ఎన్టీఆర్ తో బాబీ జై లవకుశ సినిమాను రూపొందించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో ఎన్టీఆర్ మరియు తమన్నా చేసిన స్వింగ్ జర ఐటం సాంగ్ ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే. ఇప్పటికి కూడా ఆ పాట ఎక్కడో ఒక చోట వినిపిస్తూ కనిపిస్తూనే ఉంటుంది.
అంతటి సక్సెస్ అయిన స్వింగ్ జర పాట బ్యూటీని ఇప్పుడు తాను రూపొందిస్తున్న బాలయ్య సినిమా కోసం తీసుకు వచ్చేందుకు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈమధ్య కాలంలో హీరోయిన్ గా కంటే ప్రత్యేక పాటలు, పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్న తమన్నా ఇప్పటికే బాలయ్య సినిమాలో ప్రత్యేక పాటకు ఓకే చెప్పిందని సమాచారం అందుతోంది.
బాలయ్య మరియు బాబీ కాంబోలో సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయినా కూడా ఇప్పటి వరకు పలు విషయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా హీరోయిన్, ఐటం సాంగ్ విషయంలో అతి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి బాలయ్య ఫ్యాన్స్ కోసం బాబీ సమ్ థింగ్ ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. అది ఏంటి అనేది చూడాలి.