తమన్నా తెలుగింట కోడలే!
విజయ్ వర్మ స్వస్థలం హైదరాబాద్. కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లోనే ఉన్న విజయ్ కుటుంబం ఆ తర్వాత ముంబైలో స్థిరపడినట్లు సమాచారం.
By: Tupaki Desk | 20 July 2023 12:57 PM GMTమిల్కీబ్యూటీ తమన్నా- విజయ్ వర్మ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరి వ్యవహారం అంతా పబ్లిక్. కొన్ని నెలలు పాటు మ్యాటర్ రహస్యంగా ఉంచిన చివరికి ఓపెన్ అవ్వక తప్పలేదు. వెబ్ సిరీస్ ల్లో ఇంటిమేట్ సన్నివేశాలతో ఇద్దరి మధ్య అసలేం జరుగుతోంది? అన్నది క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత వాళ్లకు వాళ్లుగానే ఓపెన్ అయ్యారు. అంతవరకూ ప్రేమ గీమ లేదు అని చెప్పిన తమన్నా ఒక్కసారిగా విజయ్ గురించి ఆకాశానికి ఎత్తేసి..అతనే తన సర్వస్వం అనేసింది.
విజయ్ వర్మ సైతం తమన్నా శ్వాసగా జీవిస్తున్నాడు. ఇఇదంతా అందిరికీ తెలిసిన విషయమే. మరి ఈ ప్రేమ పెళ్లి వరకూ దారి తీస్తుందా? మద్యలోనే వీగిపోతుందా? అన్నది పక్కనబెడితే ..ఒకవేళ పెళ్లి చేసుకుంటే మాత్రం తమన్నా తెలుగింట కోడలువుతుంది. అవును విజయ్ వర్మ స్వస్థలం హైదరాబాద్. కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లోనే ఉన్న విజయ్ కుటుంబం ఆ తర్వాత ముంబైలో స్థిరపడినట్లు సమాచారం. అటుపై విజయ్ చదువు..వృత్తి పరంగా ముంబైలోనే జరిగింది.
కుటుంబం కూడా అప్పటికే అక్కడ స్థిరపడటంతో! ముంబై వాసులుగా మారిపోయారు. అయితే ముంబై వెళ్లినా విజయ్ మూలాలు అన్ని ఇక్కడే ఉన్నాయి. బంధువులు..ఇతర కుటుంబ సభ్యులు అంతా తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నారుట. ఆ రకంగా విజయ్ ని మనువాడితో తమన్నా తెలుగింట కోడల వుతుంది. ఇక పెళ్లి ముంబైలో జరుగుతుందా? హైదరాబాద్ లో నా? అన్నది పక్కనబెడితే..తమన్నా టాలీవుడ్ కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఇక్కడే అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. ముంబై బ్యూటీ అయినా తెలుగు లోగిళ్లలో ఎంతో తెలిసిన నటిగా ఫేమస్ అయింది. మాతృభాష మరాఠీ అయినా తెలుగు ఎంతో చక్కగా మాట్లాడుతుంది. తెలుగు అభిమానుల్ని ఎంతో ప్రత్యేకంగా ట్రీట్ చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమలో స్థిరపడాలని చూస్తున్నా! టాలీవుడ్ ఆమెని వదలడం లేదు. ఇక్కడ దర్శక ..నిర్మాతలు.. హీరోలు అవకాశాలు కల్పిస్తన్నారు. బాలీవుడ్ లో బిజీ అయినా అప్పుడప్పుడు తెలుగు తెరపైనా కనిపించాలి అన్నంత ప్రేమను చూపిస్తున్నారు.