విజయ్ వర్మతో తమన్నా ఇప్పట్లే లేనట్టే!
విజయ్ వర్మ-తమన్నా లవ్ స్టోరీ గురించి తెలిసిందే. రియల్ రొమాన్స్ ని రీల్ రూపంలో ఓపెన్ చేసారు.
By: Tupaki Desk | 5 Sep 2023 1:30 AM GMTవిజయ్ వర్మ-తమన్నా లవ్ స్టోరీ గురించి తెలిసిందే. రియల్ రొమాన్స్ ని రీల్ రూపంలో ఓపెన్ చేసారు. కొన్ని రోజుల పాటు దోబుచులాట ఆడిన తర్వాత నిజం అంగీకరించక తప్పలేదు. అప్పటి నుంచి ఆ జంట ప్రేమ అధికారికం అయింది. ప్రస్తుతం కలిసి మెలిసి పని చేస్తున్నారు. ఒకరిపై ఒకరికి వ్యక్తిగతంగా ఎంత ప్రేమ ఉన్నదో ఓపెన్ గానే చెప్పారు. దీంతో ఈ జంట పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని భావించారు.
ఇదే ఏడాది వివాహ బంధంతో ఒకటవుతారని అంతా భావిస్తున్నారు. అయితే తాజాగా అభిమానుల ఆశలపై తమన్నా నీళ్లు చల్లేసింది. ఇప్పట్లో పెళ్లి ఏంటి? నాన్సెన్స్ అంటూ మూతి బిగించింది.` భారతీయ వివాహ వ్యవస్థపై నాకు ఎంతో నమ్మకం ఉంది. పెళ్లి చేసుకోవాలని కొన్నాళ్ల క్రితం అనుకున్నాను. అయితే కెరీర్ బిజీగా మారడంతో పెళ్లి ఆలోచనకు ముగింపు పలికాను.
ప్రస్తుతం పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. అందువల్ల తన పెళ్లి వార్త వినాలంటే చాలా రోజులు ఎదురు చూడాల్సిందేనని` అని అంది. దీంతో నెటి జనుల్లో కొత్త సందేహాలు మొదలయ్యాయి. మొన్నటివరకే విజయ్ జపం చేసిన అమ్మడు ఇప్పుడు పెళ్లి అంటే? కెరీర్ అంటోంది? ఏంటి సందేహిస్తున్నారు.
మాల్దీవులకు వెళ్లొచ్చిన తర్వాత ఇద్దరి మధ్య ఏవైనా పొర పొచ్చాలు వచ్చాయా? అని అనుమాని స్తున్నారు.
తమన్నా-విజయ్ ఇద్దరు ఇటీవల మాల్దీవులకు వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తమన్నా వద్ద ఈ టాపిక్ రావడంతో ఇలా స్పందించింది. దీంతో మాల్దీవుల్లో ఇద్దరి మధ్య వివాదాలు ఏవైనా తలెత్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. తమన్నా కెరీర్ ఇప్పటికే ముగింపు దశకు చేరినట్లు మీడియా కథనాలు వెడెక్కిస్తున్నాయి. హీరోయిన్ గా అవకాశాలైతే తగ్గాయి. చిన్న చిన్న సినిమాలు.. పాత్ర లు సైతం చేస్తోంది. ఆరకంగా అమ్మడి పెళ్లికి ముందే సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. మరి తాజా పుకార్లకి తమన్నా ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.